Hindenburg Research : అదానీ కంపెనీల్లో అవకతవకలంటూ రిపోర్ట్..!
దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలలో పాల్గొన్నట్లు నివేదిక; హిడెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ పరిశోధన...

అదానీ గ్రూప్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హింబెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపించింది. దశాబ్దాలుగా స్పష్టమైన స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిన్నట్లు నివేదికను విడుదల చేసింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. వేల కోట్ల సంపద ఆవిరైంది. అదానీ కంపెనీల నికర ఆస్థుల విలువ సుమారు 120బిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన మూడేళ్లలో ఏకంగా 100బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
అదానీకి గ్రూప్ లో ఏడు లిస్టెడ్ కంపెనీలు, 85శాతం నష్టాన్ని, గణనీయమైన రుణాలను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది. 'adani group : how the world richest man is pulling the largest can in corporate history'అనే శీర్శికతో రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. ఇందుకు రెండేళ్ల కాలం పట్టిందని తెలిపింది. మారిషస్, యూఏఈ, కరేబియన్ దీవుల వంటి ట్యాక్స్ హెవెన్ ప్రాంతాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు అదానీ కుటుంబ సభ్యులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలిపింది. నకిలీ ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలను కూడా అధానీ గ్రూప్ నిర్వహించినట్లు చెప్పింది. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ 8సంవత్సరాల కాలంలో ఐదుగురు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లను మార్చిందని, ఇది అకౌంటింగ్ సమస్యలను సూచించే రెడ్ ఫ్లాట్ అని నివేదిక వెళ్లడించింది.
నివేదిక కారణంగా, అదానీ వ్యక్తిగత సంపద ఒక్కరోజులోనే $5.9 బిలియన్ డాలర్లకు తగ్గి, $120.6 బిలియన్లకు పడిపోయింది. ఏడు అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా రూ.46,086 కోట్ల మార్కెట్ ను కోల్పోయాయి. ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానంలో ఉన్న అదానీ మూడవ స్థానానికి పరిమితమయ్యాడు.