Home Loan : శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గాయ్.. దసరాకి కొత్తింటికి వెళ్తున్నారా?

Home Loan : శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గాయ్.. దసరాకి కొత్తింటికి వెళ్తున్నారా?
Home Loan : వడ్డీ రేట్లు నడ్డి విరుస్తుంటాయని కొత్తింటి కలను వాయిదా వేస్తుంటారు మధ్యతరగతి కుటుంబీకులు.

Home Loan : వడ్డీ రేట్లు నడ్డి విరుస్తుంటాయని కొత్తింటి కలను వాయిదా వేస్తుంటారు మధ్యతరగతి కుటుంబీకులు. అయితే గృహ రుణాలపై తగ్గుతున్న వడ్డీ రేట్లు ఇల్లు కొనుగోలుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో స్థిరాస్థి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. పండుగ సీజన్, వడ్డీ రేట్లు తగ్గడం, కోవిడ్ కష్టాలనుంచి బయటపడడంతో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. బ్యాంకులు ఇంటి కొనుగోలుకు ఇచ్చే రుణాలు కూడా తగ్గడంతో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారి సంఖ్యతో పాటు, ఫ్లాట్ల కొనుగోలు వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు నగర జీవులు.

బడ్జెట్ అందుబాటులో ఉండడంతో ఇంటి కోసం వేట ప్రారంభిస్తున్న వారి సంఖ్య ఎక్కువైంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, కొత్త ఏడాదిలోకి ప్రవేశించేలోపు కొత్త ఇంట్లోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. విజయదశమి సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు. ఈ ఏడాదే ఇంటిని కొనుగోలు చేయాలనే ఆసక్తి చూపుతున్న వారు దాదాపు 80 శాతం మంది ఉన్నారు. ముందు ముందు ఇల్లు కొనుగోలు మరింత కష్టమని అభిప్రాయపడుతున్నారు. బిల్డర్లు కూడా కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తుండడం వంటి సానుకూల అంశాలు ఇల్లు కొనుగోలు దారులకు కలిసొచ్చే అంశాలు.

ఇల్లు కొనే ఆలోచన ఉంటే ముందునుంచే ప్రణాళికలు వేసుకోవాలి. ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు 7.5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 6.6 శాతం వడ్డీపై కూడా రుణాలు ఇస్తున్నాయి.

గృహ రుణం 85 శాతం వస్తుంది. మిగిలిన 15 శాతం మీరు పొదుపు చేసిన మొత్తం ఉంటే సరిపోతుంది. పిల్లల చదువులు, వివాహాలు లాంటి ముఖ్యమైన కార్యాలు ఉంటే అదనపు భారం పడకుండా చూసుకోవాలి.

చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇంటి కల నెవేర్చుకునేందుకు.. బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే రుణం పొందేందుకు అర్హత సంపాదిస్తారు. వ్యాపారానికి, ఇంటికి అవసరాన్ని బట్టి రుణం తీసుకోవచ్చు.

ఇక ఉద్యోగులైతే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల అప్పులను వీలైనంత త్వరగా తీర్చేయాలి. రుణం పొందేందుకు సిబిల్ కూడా పరిగణనలోకి తీసుకుంటారని గుర్తించాలి.

Tags

Read MoreRead Less
Next Story