19 Feb 2021 6:05 AM GMT

Home
 / 
బిజినెస్ / ఆర్‌ఎస్ 350 బైక్...

ఆర్‌ఎస్ 350 బైక్ అదిరింది బాస్.. మీ కోసం మార్కెట్లో..

వివిధ కంపెనీలు యువతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త రకం బైకులను, కొత్త మోడళ్లను తీసుకొస్తుంటాయి.

ఆర్‌ఎస్ 350 బైక్ అదిరింది బాస్.. మీ కోసం మార్కెట్లో..
X

ఖరీదైన కార్లలో ప్రయాణం చేయడం కంటే బైక్ మీద ఝామ్మంటూ దూసుకెళ్లడమంటే యువతకు సరదా. మోటారు బైకులకు సంబంధించిన వివిధ కంపెనీలు యువతను, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త రకం బైకులను, కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తుంటాయి. తాజాగా ద్విచక్రవాహనాల్లో అగ్రగామిగా ఉన్న హోండా సంస్థ సరికొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే హోండా సీబీ 350 ఆర్‌ఎస్. మేడిన్ ఇండియా ఫర్ ద వరల్డ్‌లో భాగంగా విడుదలైన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోంది. ఎక్స్ షోరూంలో హోండా సీబీ 350 ఆర్‌ఎస్ ప్రారంభ ధర వచ్చి రూ.1.96 లక్షలు.

ఫీచర్లు చూస్తే..

ఈ సరికొత్త సీబీ 350 ఆర్‌ఎస్ మోటార్ సైకిల్ భారీ ఫ్యూయల్ ట్యాంకును కలిగి ఉండి Y- ఆకారపు అల్లాయ్ వీల్స్‌ తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఎల్‌ఈడీ హెడ్ ల్యాంపు, ఎల్‌ఈడీ వింకర్లు, అండర్ సీట్ స్లీక్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంపుల వల్ల మోడర్న్ రోడ్ స్టర్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఇవే కాకుండా బ్లాక్ స్మోకెడ్ ఫ్రంట్ అండ్ రియర్ ఫెండర్స్‌తో స్పోర్టీ లుక్‌లో దర్శనమిస్తోంది.

ఇంజిన్ విషయానికి వస్తే..

2021 హోండా సీబీ 350 మోటార్ సైకిల్ 350 సీసీ ఎయిర్ కూల్డ్ 4- స్ట్రోక్ ఓహెచ్ సీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5500 ఆర్పీఎం వద్ద 20.7 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 30 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ పీజీఎం-ఎఫ్‌ఐ సిస్టంతో పని చేస్తుంది. ఇంజిన్‌కు ఆప్టిమమ్ ఫ్యూయల్ డెలివరి వల్ల మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

ప్రత్యేకతలు..

ఈ మోటార్ సైకిల్లో ఫస్ట్ అడ్వాన్స్‌డ్ డిజిటల్ అనలాగ్ మీటర్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ డీటైల్స్ టార్క్ కంట్రోల్‌తో పాటు ఏబీఎస్, సైడ్ స్టాండ్ ఇండికేటర్‌తో కూడిన ఇంజిన్ ఇన్హిబిటర్ ఇందులో ఉంది. గేర్ పిస్టన్ ఇండికేటర్, బ్యాటరీ వోల్టేజి లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. రియల్ టైం మైలేజీ, యావరేజ్ మైలేజీ, డిస్టెన్స్ ఎంప్టీ అనే మూడు ఫ్యూయల్ ఎఫిషియన్స్ మోడ్స్ లో రైడింగ్‌ని ఆస్వాదించవచ్చు.

honda-cb350-rs-launched-in-india-at-rs-1-96-lakh

ఆర్‌ఎస్ 350 బైక్ అదిరింది బాస్.. మీ కోసం మార్కెట్లో..honda-cb350-rs-launched-in-india-at-rs-1-96-lakh

ఆర్‌ఎస్ 350 బైక్ అదిరింది బాస్.. మీ కోసం మార్కెట్లో..ఇక బ్రేకులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..

బ్రేకింగ్ సెటప్ దగ్గరకొస్తే ఫ్రంట్‌లో 310 ఎంఎం డిస్క్ బ్రేకులు, 240 ఎంఎం రియర్ డిస్క్ బ్రేకులు అడెక్వాట్ బ్రేకింగ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి పనితీరును కనబరిచేలా రూపొందించారు. ఈ బైక్ రెండు కలర్స్‌లో లభ్యమవుతోంది. రెడ్ మెటాలిక్, బ్లాక్‌తో కూడిన పెరల్ స్పోట్స్ యెల్లో కలర్‌లో అందుబాటులో ఉన్నాయి. హోండా ప్రీమియం డీలర్లయిన బింగ్ వింగ్ టాప్ లైన్, బింగ్ వింగ్ వద్ద ఈ మోటార్ సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు.

Next Story