Rent Now Pay Later: అకౌంట్‌లో నిల్ బ్యాలెన్స్.. అయినా 'రెంట్ నౌ పే లేటర్' ద్వారా ఇంటి అద్దె ఈజీగా..

Rent now Pay later: అద్దె కట్టడానికి కూడా అస్సలు డబ్బులు లేవు. ఈ మంత్ చాలా టైట్.. తరుచుగా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఏ అవసరమూ చెప్పి రాదు.. ఒక్కోసారి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అలాంటప్పుడు రెంట్ నౌ పే లేటర్ ఆప్షన్ కొండంత భరోసాని ఇస్తుంది. హౌసింగ్.కామ్ అనే సంస్థ ఈ వినూత్న అంశానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న నీరో అనే ఫిన్‌టెక్ స్టార్టప్‌తో చేతులు కలిపి దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
సమయానికి డబ్బుల్లేని కస్టమర్లు ఆర్ఎన్‌పీఎల్ ద్వారా అద్దె చెల్లించవచ్చు. ఇందుకోసం ఎలాంటి కన్వీనియెన్స్ ఫీజు లేదు. పైగా నలభై రోజులల వరకు ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ ఉండదు. అవసరమైతే ఆ మొత్తాన్ని నెలవారీ ఈఎమ్‌ఐ రూపంలో చెల్లించొచ్చు. క్రెడిట్‌పై అద్దెకు తీసుకోవాలనుకునే వారికి కార్డు లేకపోతే ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. ఈ సేవల్ని ప్రారంభించడానికి ముందే ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు అగర్వాల్ తెలిపారు. దాదాపు లక్ష మంది యూజర్లు ఈ సేవలను ఉపయోగించుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com