CIBIL Score: సిబిల్ స్కోరు ఎంత ఉంటే రుణం మంజూరవుతుంది..

CIBIL Score: సిబిల్ స్కోరు ఎంత ఉంటే రుణం మంజూరవుతుంది..
CIBIL స్కోర్ అనేది మీ క్రెడిట్ యోగ్యతను కొలిచే ముఖ్యమైన అంశం. మీరు గృహ రుణం, వ్యక్తిగత రుణం మరియు ఇతర క్రెడిట్ ఉత్పత్తుల కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాతలు దీనిని పరిగణనలోకి తీసుకుంటారు.

CIBIL Score: CIBIL స్కోర్ అనేది మీ క్రెడిట్ యోగ్యతను కొలిచే ముఖ్యమైన అంశం. మీరు గృహ రుణం, వ్యక్తిగత రుణం మరియు ఇతర క్రెడిట్ ఉత్పత్తుల కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాతలు దీనిని పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోరు ఉన్న వ్యక్తులకు బాధ్యతాయుతమైన రుణ గ్రహీతలుగా పరిగణిస్తారు.

రుణదాతలు మీ లోన్ దరఖాస్తును ఆమోదించడానికి ముందు మీరు అరువు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ మీ డిఫాల్ట్ ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. మీరు అధిక స్కోర్‌ని కలిగి ఉంటే, మీరు బాధ్యతాయుతమైన రుణగ్రహీత అని మరియు మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు మరియు EMIలను సకాలంలో చెల్లించారని సూచిస్తుంది.

మీ CIBIL స్కోర్ 550 కంటే తక్కువగా ఉంటే చాలా మంది రుణదాతలు వ్యక్తిగత రుణ దరఖాస్తును తిరస్కరిస్తారు. తక్కువ CIBIL స్కోర్ మీరు ఆర్థికంగా స్థిరంగా లేరని, రుణాన్ని తిరిగి చెల్లించడం కష్టమని సూచిస్తుంది. కొంతమంది రుణదాతలు తక్కువ క్రెడిట్ స్కోర్ కోసం వ్యక్తిగత రుణాలను అందిస్తారు. అయితే, వీటికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.

సిబిల్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి క్రెడిట్ చెల్లింపులు క్రమం తప్పకుండా చేస్తున్నారని అర్థం. కాబట్టి బ్యాంకులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. వీరికి బ్యాంకులు సులభంగా రుణం మంజూరు చేస్తాయి.

సిబిల్ స్కోరు 700 -749 ఉంటే తక్కువ వడ్డీకి రుణం రావడం కొంచెం కష్టంగా మారుతుంది.. వీరు మరింత స్కోరును పెంచుకోవడం అవసరం.

సిబిల్ స్కోర్ 600 -699 ఉంటే సకాలంలో బకాయిలు చెల్లించడానికి మీరు ఇబ్బంది పడుతున్నారని అర్థం. రిస్క్ పెరుగుతుంది. దీంతో బ్యాంకులు మీరు రుణం మంజూరు చేయడానికి ఆలోచిస్తాయి. ఈ స్థాయికంటే కంటే తక్కువకు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో సిబిల్ స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

మీ సిబిల్ స్కోరు 350-599 ఉంటే ప్రమాదకర స్థాయిని సూచిస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాలు సమయానికి చెల్లించడంలో విఫలం అవుతున్నారని అర్థం. సిబిల్ స్కోర్ ఈ విధంగా ఉంటే ఆర్థిక సంస్థలు రుణం మంజూరు చేయడానికి విముఖత చూపుతాయి.

ఎన్ఏ/ఎన్‌హెచ్‌

క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తులకు సిబిల్ స్కోరు ఎన్ఏ/ఎన్‌హెచ్‌ గా చూపిస్తుంది. క్రెడిట్ కార్డు ఉపయోగించని లేదా మునుపెన్నడూ రుణం తీసుకోని వ్యక్తులకు క్రెడిట్ చరిత్ర ఉండదు.

రుణాలు సులభంగా లభించాలన్నా, తక్కువ వడ్డీకే రుణం పొందాలన్నా మంచి క్రెడిట్ స్కోరు ఉండడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డు బిల్లులను, తీసుకున్న రుణాలను సమయానికి చెల్లించాలి.

Tags

Read MoreRead Less
Next Story