5G Network Services : మీ ఫోన్‌కు 5జీ నెట్‌వర్క్ కనెక్ట్ అవుతుందా..? లేదా..? ఇలా తెలుసుకోండి..

5G Network Services : 2జీ, 3జీ, 4జీ కాలం అయిపోయింది. ఇప్పుడు 5జీ నెట్‌వర్క్‌లో అడుగుపెడుతున్నాం. ఈ 5జీ నెట్‌వర్క్‌తో ఇప్పుడున్న ఇంటర్నెట్ వేగంకంటే 10 రెట్ల వేగంతో సర్వీసులు పొందననున్నాం. ఇటీవళ 5జీ నెట్‌వర్క్ వేలం పూర్తయింది. దిగ్గజ నెట్‌వర్క్ సంస్థలైన జియో, ఏయిర్‌టెల్‌లు, వొడాఫోన్లు ఈ 5జీ నెట్‌వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పటికే 5జీ సేవలు మొదలైనట్లు వినిపిస్తోంది.
ప్రస్తుతం మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లు 5జీ నెట్వర్క్‌కు సపోర్ట్ చేస్తాయో లేదో తెలుసుకోవాలంటే ఈ కింది సెట్టింగ్స్‌ను ఒకసారి ఫాలో అవండి
- సెట్టంగ్స్ యాప్‌కు వెళ్లండి
- వైఫై లేదా నెట్వర్క్ ఆఫ్షన్‌పై క్లిక్ చెయ్యండి
- తరువాత సిమ్ మరియు నెట్‌వర్క్ ఆప్షన్‌ను ఎంచుకోండి
- క్లిక్ చేయగానే మీ ఫోన్ ఏ నెట్వర్క్‌కు సపోర్ట్ చేస్తుందో అక్కడే డిస్‌ప్లేలో చూపెడుతోంది
- ఒక వేళ 5జీకి సపోర్ట్ చేస్తే.. 2జీ/3జీ/4జీ/5జీ అని చూపిస్తుంది
5జీ ప్రారంభమై కొన్ని రోజులే కావడంతో అప్పుడే అన్ని ఆండ్రయిడ్ ఫోన్లకు ఈ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. 5జీని ప్రత్యేకంగా సపోర్ట్ చేసే మొబైల్స్‌ను మార్కెట్‌లోకి త్వరలోనే విడుదల చేయనున్నట్లు పలు ప్రముఖ మొబైల్ సంస్థలు ప్రకటించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com