25 July 2021 4:00 AM GMT

Home
 / 
బిజినెస్ / House: సొంతింటి కల...

House: సొంతింటి కల నెరవేరాలంటే..

ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం ఇల్లు. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలని మధ్యతరగతి వాసి కల.

House: సొంతింటి కల నెరవేరాలంటే..
X

House: సొంతిల్లు ఉంటే అద్దెలు కట్టే బాధ తప్పుతుంది అని ఎవరు మాత్రం అనుకోకుండా ఉంటారు. ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం ఇల్లు. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలని మధ్యతరగతి వాసి కల. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఉద్యోగంలో చేరిననాడే అనుకుంటారు. అప్పో సప్పో చేసి ఇల్లు కొనాలని ఆశపడుతుంటారు. ఇప్పుడు చాలా బ్యాంకులు, మరి కొన్ని సంస్థలు ఇంటి లోను ఇస్తామంటూ వెంట పడుతున్నాయి. మన బడ్జెట్‌కి తగ్గ ఇల్లు, ఉత్తరోత్తరా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం.

ఇల్లు కొనాలి అంటే మొదటగా ఆలోచించేది ఎక్కడ కొనాలి, ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అని. నిజానికి మనకి అందుబాటు ధరలో ఉన్న ఇళ్లు నచ్చవు. మనకు నచ్చిన ఇల్లు ధరకి మన బడ్జెట్ సరిపోదు. పోనీ ఆదాయం పెరిగిన తరువాత కొందాంలే అనుకుంటే అప్పటికి ఇళ్ల రేట్లు పదింతలవుతాయి. ఆలోచిస్తూ కూర్చోక తలకు మించిన భారం పెట్టుకోకుండా మీ బడ్జెట్లో దూరమైనా ఇల్లు కొనుగోలు చేయడం మంచిది. ఇప్పుడు రవాణా సౌకర్యం నగరం నలుమూలలకు ఉంది కాబట్టి ముందడుగు వేయొచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడకపోతే ఇంటి కల కలగానే మిగిలిపోతుంది.

మీరు ప్రస్తుతం ఉంటున్న ఏరియాలోనే కొనాలని వెతికితే ఒక్కోసారి దొరక్కపోవచ్చు. దగ్గర్లో మరో మంచి ఏరియా దొరక్కపోదు. అక్కడికి రవాణా సౌకర్యాలు, ఇతర విషయాలు ఎలా ఉన్నాయో చూసుకుని ధర అనుకూలంగా ఉంటే కొనుగోలు చేయవచ్చు.

అయితే బడ్జెట్ ధరలో ఇల్లు దొకట్లేదని మీ ప్రయత్నాన్ని విరమించుకోవద్దు. మీ దృష్టికి వచ్చిన ప్రతి ఇంటిని ఒక సారి చూసి రండి. బడ్జెట్ ధరలో ఇళ్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి చూడడం ఆపొద్దు. అప్పుడే మీరు కోరుకున్న మీ సొంతమవుతుంది.

ఒకవేళ ఇల్లు దొరక్కపోయినా మంచి స్థలం అందుబాటులో ఉంటే దాన్ని అయినా కొనుగోలు చేయండి. త్వరిత గతిన అభివృద్ధి చెందిన నగరం నలుమూలలు స్థలం రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. వృద్ధికి అవకాశం ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నా పెట్టుబడి విలువ పెరుగుతుంది.

ఎంతో కొంత చేతిలో నగదు ఉంటేనే స్థిరాస్థి కొనుగోలుకు మొగ్గు చూపుతాం. కాబట్టి ఆ ప్రయత్నం త్వరగా నెరవేతుందని అంటారు రియల్టర్లు.

ఇల్లు కొనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇతరత్రా అప్పులు చేయవద్దు. ఇప్పుడు అన్నిటికీ లోన్ ఇస్తున్నారు కదా అని ఆలోచించకుండా అవీ ఇవీ కొనేయొద్దు. ఇంటి కొనుగోలుకే మొదటి ప్రాధాన్యత. దాని తరువాతే ఏదైనా అని కుటుంబసభ్యులు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలి. ఎక్కడైనా మంచి ఇల్లు అమ్మకానికి ఉందంటే డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇతర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. డౌన్‌పేమెంట్‌కు అవసరమైనంత సమకూర్చుకుంటే ఆలోచించే పని ఉండదు.

Next Story