UPI Payments: ఇంటర్నెట్ లేకున్నా మనీ ట్రాన్స్‌ఫర్.. యూపీఐలో ఆ సదుపాయం..

UPI Payments: ఇంటర్నెట్ లేకున్నా మనీ ట్రాన్స్‌ఫర్.. యూపీఐలో ఆ సదుపాయం..
UPI Payments: ఫీచర్డ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ రెండింటిలోనూ ఇంటర్‌నెట్ సదుపాయం లేకుండా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.

UPI: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ).. స్మార్ట్ ‌ఫోన్ ద్వారా ఒకరి బ్యాంక్ ఖాతా నుంచి వేరొకరికి నగదు బదిలీ చేయడం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన భీమ్ యాప్‌తో పాటు పేటీఎమ్, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటి ప్రైవేట్ యాప్‌లు కూడా యూపీఐ చెల్లింపు సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం ఆయా యాప్‌లను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇందుకోసం ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండాలి. కానీ ఫీచర్డ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ రెండింటిలోనూ ఇంటర్‌నెట్ సదుపాయం లేకుండా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. *99#కి డయల్ చేయడం ద్వారా ఈ సర్వీస్ మీకు లభిస్తుంది. దీనిని USSD 2.0గా కూడా పిలుస్తారు.

రిజిస్టర్ చేసుకునే విధానం..

బ్యాంకులో నమోదు చేసుకున్న మీ మొబైల్ నుంచి *99# డయల్ చేసి బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి.

మీ డెబిట్‌కార్డులోని చివరి 6 అంకెలను ఎంటర్ చేయాలి.

ఎక్స్‌పైరీ తేదీ, యూపీఐ పిన్ ఎంటర్ చేసి ధ్రువీకరించాలి.

అయితే ఇక్కడ ఒకటి కచ్చితంగా గుర్తుంచుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నుంచి డయల్ చేసినప్పుడు మీ బ్యాంకు ఖాతా నెంబరు సహా ఇతర వివరాలు కనిపించాలి. లేదంటే ముందుకు వెళ్లకూడదు.

నగదు బదిలీ చేసే విధానం..

ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి **99#కి డయల్ చేయాలి.

స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్‌లో డబ్బు పంపించడం కోసం సెండ్ మనీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందుకోసం 1పై క్లిక్ చేయాలి.

తరువాత ఏ ఆప్షన్ ద్వారా డబ్బు పంపించాలో సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబరు అయితే 1, యూపీఐ ఐడీ అయితే 3, సేవ్ చేసిన లబ్ధిదారుని కోసం 4, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కోసం 5 క్లిక్ చేయాలి.

ఉదాహరణకు మీరు మొబైల్ నెంబరు ద్వారా పంపించాలి అనుకుంటే 1న డయల్ చేయాలి.

తర్వాత ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వారి మొబైల్ నెంబరును ఎంటర్ చేయాలి.

వారి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరించుకున్న తర్వాతే ముందుకు సాగాలి

వివరాలు సరిగా ఉన్నాయో లేదో మరోసారి చూసుకుని మీరు పంపించాలనుకుంటున్న మొత్తాన్ని డయల్ ప్యాడ్‌తో ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత మీ లావాదేవీకి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరించాలి.

అన్నీ సరిగా ఉన్నాయని భావిస్తే అప్పుడు యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.

డబ్బు బదిలీ విజయవంతంగా పూర్తైన తరువాత మొబైల్ నెంబరుకి మెసేజ్ వస్తుంది.

లావాదేవీ రిఫరెన్స్ నెంబరును ముందు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story