Financial Crisis: ఆర్థిక సమస్యలను అధిగమించాలంటే..

Financial Crisis: ఆర్థిక ఆందోళనలు ఎప్పుడూ ఉంటాయి. అయితే వాటిని అధిగమించాలంటే ఒక నిర్ధిష్ట ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. అది మీపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది.. అనుకోని ఖర్చులు మీ జేబుపై భారం పడేలా చేస్తాయి. ముందునుంచే ఒక పద్ధతి ప్రకారం ఖర్చులు అలవాటు చేసుకుంటే అనవసర ఆందోళనకు ఆస్కారం ఉండదు. సమయానికి బిల్లులు చెల్లించడం, రుణాన్ని తగ్గించడం-మీ మొత్తం దృక్పథాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
నెలవారీ బడ్జెట్‌ను రూపొందించండి
బడ్జెట్ అనేది మీ ఆర్థిక స్థితిని నియంత్రించడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఇది మీ వద్ద ఉన్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా అలాగే భవిష్యత్తు లక్ష్యాల కోసం ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది.
ప్రతి నెలా ఖర్చులు పోను ఎంత మిగులుతుందో రాసుకోండి.
మీ అద్దె, రోజువారీ అన్ని ఖర్చులను వ్రాయండి.
మీ ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోండి
రోజువారీ ఖర్చులపై ఆదా చేసే మార్గాలను గుర్తించండి.
అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి
కారు మరమ్మతులు, ఉద్యోగం కోల్పోవడం లేదా మారాల్సి రావడం, అనారోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల కోసం డబ్బును పక్కన పెట్టడం అవసరం. ఇది మీకు మూడు నుండి ఆరు నెలల ఖర్చులను కవర్ చేయడానికి సరిపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
మీ అవసరాల జాబితాలోని ఖర్చులను లెక్కించిన తర్వాత ఎంత పొదుపు చేయగలరో నిర్ణయించుకోండి.
రుణాన్ని తగ్గించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించండి
క్రెడిట్ కార్డ్ రుణాలు ఆర్థిక ఒత్తిడికి మూల కారణం. మీ అప్పులను ఒక్కొక్కటిగా చెల్లించడం, మొదట అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న కార్డ్‌లపై దృష్టి పెట్టడం వంటివి చేయాలి.
మీ ప్రతి కార్డుపై కనీస చెల్లింపు చేయడానికి కట్టుబడి ఉండాలి. కొత్త క్రెడిట్ కార్డ్ రుణాన్ని తీసుకోకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com