తెలంగాణ పారిశ్రామికరంగంలో మరో మైలురాయి

తెలంగాణ పారిశ్రామికరంగంలో మరో మైలురాయి

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సంస్థ ముందుకొచ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు రూ. 20 వేల 761 కోట్ల పెట్టుబ‌డులు పెట్టనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రానికి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అమెజాన్ మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేస్తుంది. ప్రతి అవైలబిలిటీ జోన్‌లో అనేక డేటా సెంటర్లు ఏర్పాటు అవుతాయి. 2022 సంవత్సర తొలి అర్ధ సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కార్యకలాపాలు ప్రారంభం అయితే భారీగా ఉద్యోగ అవకాశాలు బారీగా లభించే అవకాశం ఉంది.

అమెజాన్ సంస్థ‌కు మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ పెట్టుబ‌డుల‌తో స్థానిక యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మెరుగుపడతాయన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటనలో ప్రారంభించినట్లు తెలిపారు. దావోస్ పర్యటనలో అమెజాన్ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిపిన చర్చల వివరాలను ఆయన షేర్ చేసుకున్నారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు మరియు పాలసీల ద్వారా ఐటీ, ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున విస్తరిస్తుందన్నారు. ఇన్నోవేటివ్ స్టార్టప్లకు, నైపుణ్యం కలిగిన రిసోర్స్ కు కేంద్రం గా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. తాజాగా అమోజాన్ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అమెజాన్ కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు మంత్రి. ఇప్పటికే అమెజాన్ తన అతిపెద్ద ఫెసిలిటీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసింది. దేశంలోనే అతిపెద్ద కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. కొత్తగా వచ్చే కంపెనీలకు, ఇప్పుడున్న కంపెనీల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందన్నారు.

Also Read:profit your trade

Tags

Read MoreRead Less
Next Story