న్యూ ఎలక్ట్రిక్ కార్‌.. చూస్తే సూపర్బ్ లుక్ గురూ అన్పించకమానదు!

న్యూ ఎలక్ట్రిక్ కార్‌.. చూస్తే సూపర్బ్ లుక్ గురూ అన్పించకమానదు!
హ్యుండాయ్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఐయోనిక్ 5 టీజర్ వదిలింది.కారును చూడగానే సూపర్బ్ లుక్ గురూ అన్పించకమానదు.

ఇక రాబోయేదంతా ఎలక్ట్రిక్ కార్ల యుగమేనా అంటే..అలానే కన్పిస్తోంది. గత వారమే అమెరికన్ టెస్లా ఇండియాలో ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుందనగా.. తాజాగా హ్యుండాయ్ కంపెనీ తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఐయోనిక్ 5 టీజర్ వదిలింది. కారును చూడగానే సూపర్బ్ లుక్ గురూ అన్పించకమానదు.

ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులార్ ప్లాట్‌ఫామ్‌పై లివింగ్ స్పేస్ థీమ్‌తో మార్కెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకునేలా హ్యుండాయ్ రిలీజ్ చేసిన టీజర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయ్ ఫిబ్రవరి 23న వరల్డ్ ప్రీమియర్ షోకి రెడీ అవుతున్న హ్యుండాయ్ ముందుగానే తన సినిమాకి టీజర్‌లాగా ఈ ఫోటోలను విడుదల చేసింది.


ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్టే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చిందైతే, దానికి తగ్గట్లుగానే హ్యుండాయ్ ఐయోనిక్ 5 ఇంటీరియర్‌లో వాడిన మెటీరియల్ కూడా ఎకో ప్రాసెస్డ్ లెదర్‌గా తెలుస్తోంది. కారు మొత్తం సహజసిద్దమైన పెయింట్, రీసైకిల్డ్ ఫైబర్ వాడారు. సీట్లను కవర్ చేసే ఈ ఎకో లెదర్‌కి తోడు ఫ్లాక్‌సీడ్ అంటే, అవిసెగింజల నూనె నుంచి తీసిన డైలతో పెయింట్ వేసినట్లు కంపెనీ ప్రకటించింది.


చూడబోతే కారులోని క్యాబిన్‌లో కూడా ఊలు,పాలీయార్న్‌ కూడా చెరకు నుంచి ఉత్పన్నమైన ఫైబర్‌తో చేసారంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఏవైతే పర్యావరణానికి హాని చేస్తాయని బ్యాన్ చేసారో పెట్ బాటిల్స్..వాటి నుంచి ఫైబర్ చేసి ఐకానిక్ 5‌కి వాడినట్లు చెప్తున్నారు. కారు డ్యాష్ బోర్డ్, స్విచ్చులు,స్టీరింగ్ వీల్, డోర్ ప్యానెల్స్ జొన్న,తదితర పూల నుంచి తీసిన బయో కాంపొనెంట్స్‌తో కోటింగ్ ఇవ్వడం మరో హైలైట్. ఇదంతా పర్యావరణానికి సంబంధించిన కోణమైతే, కారులోపల డ్రైవర్‌తో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చునేవారు హాయిగా రిలాక్స్ అవడానికి లెగ్ రెస్ట్ అకామడేట్ చేసారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పూర్తయ్యేవరకూ ఈ ఇద్దరూ హ్యాపీగా రిలాక్స్ అవడానికే ఈ అరేంజ్‌మెంట్. సీట్ల అరేంజ్‌మెంట్ కూడా మనకి అవసరమైనట్లుగా రీపొజిషన్ చేసుకోవచ్చు.


గత నెలలోనే హ్యుండాయ్ ఐయోనిక్ 5 ని రిలీజ్ చేసిన సందర్భంలోనే కొత్త సియూవీ వెర్షన్ ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకూ జర్నీ చేయవచ్చని ప్రకటించింది. ఇప్పటికే నెక్సో ఎస్‌యూవీ రన్ చేస్తోన్న హ్యుండాయ్ తొందర్లోనే మరిన్ని హైబ్రిడ్ కార్లను లాంఛ్ చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story