ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లు

ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లు

ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం (NII) 9.5శాతం పెరిగి రూ.18,308 కోట్ల నుంచి రూ.20,048 కోట్లకు చేరినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97శాతానికి తగ్గాయని పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆస్తులు 2.48శాతంగా ఉండేవి. నికర నిరర్థక ఆస్తులు 0.43శాతం నుంచి 0.42శాతానికి చేరాయని వెల్లడించింది.

Next Story