నెలవారీగా ఆదాయం ఎక్కువ రావాలంటే..!

నెలవారీగా ఆదాయం ఎక్కువ రావాలంటే..!
కోవిడ్ కారణంగా ఎకానమీ దారుణంగా పడిపోతుంది. రివైవ్ చేయడానికి RBI వడ్డీరేట్లు తగ్గిస్తోంది. ప్రస్తుతం రెపోరేటు 4శాతం కాగా..

కోవిడ్ కారణంగా ఎకానమీ దారుణంగా పడిపోతుంది. రివైవ్ చేయడానికి RBI వడ్డీరేట్లు తగ్గిస్తోంది. ప్రస్తుతం రెపోరేటు 4శాతం కాగా, రివర్స్ రెపో రేటు 3.35శాతం వద్ద ఉంది. దీంతో ప్రస్తుతం స్టేట్ బ్యాంకులో సేవింగ్ అకౌంట్ వడ్డీరేటు 2.7శాతం ఉంటే.. డిపాజిట్లపై 5.1శాతం మాత్రమే ఇస్తున్నాయి. దీంతో ఫిక్స్డడ్ డిపాజిట్ దారులు వడ్డీరేట్లు అధికంగా వచ్చే ఆప్షన్లు చూస్తున్నారు. అదే సమయంలో సేఫ్టీ కూడా కీలకంగా మారింది. ఇన్వెస్టర్లకు కొన్ని అందుబాటులో ఉన్న బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్లు చూద్దాం.

పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్

పోస్టాఫీసుల్లో ఇంకా కాస్త బెటర్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. మంత్లీ ఇన్ కం స్కీములో ప్రస్తుతం 6.6శాతం వడ్డీ రేటు ఇస్తోంది. ఏప్రిల్1, 2020 నుంచి అమల్లో ఉంది. అయితే ఇందులో రూ.4.5లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ.9లక్షలు పరిమితి ఉంటుంది. మెచ్యూర్టీ ఐదేళ్లు. 1నుంచి 3 సంవత్సరాల మధ్య క్యాష్ తీసుకోవచ్చు. అయితే వడ్డీరేటు 2 శాతం డిస్కౌంట్ ఉంటుంది. మూడేళ్ల తర్వాత 1శాతం డిస్కౌంట్ తో క్యాష్ తీసుకోవచ్చు.

ది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ V111

ఇందులో వడ్డీ రేటు 6.8శాతం వరకూ ఉంటుంది. ఇందులో అప్పర్ లిమిట్ అంటూ ఏమీ లేదు. సెక్షన్ 80c కింద మినహాయింపు కూడా పొందవచ్చు. వీటిని ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకు మార్చవచ్చు. మాగ్జిమమ్ లిమిట్ లేదు.

కిసాన్ వికాసపత్రం

కిసాన్ వికాసపత్రం 6.9శాతం వడ్డీరేటు అందిస్తోంది. ఇందులో ఎలాంటి మాగ్జిమమ్ లిమిట్ లేదు. ఈ పత్రాలను ఒకరి నుంచి మరొకరికి మార్చవచ్చు. రెండున్నరేళ్ల తర్వాత డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి వీలుంది.

అయితే స్మాల్ సేవింగ్స్ లో ప్రతిమూడు నెలలకు వడ్డీరేట్లను రివ్యూ చేయడం జరుగుతుంది. అయితే చాలాతక్కువ సమయాల్లోనే తగ్గుతుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే సేవింగ్స్ లో వడ్డీరేట్లు ఆధారపడి ఉంటాయి.

RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020

ఇక RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020 కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపై ట్యాక్స్ పడుతుంది. జులై1 నుంచి కొత్త పథకం అందబాటులోకి వచ్చింది. ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి పరిమితులు విధించలేదు. వీటిపై వడ్డీని ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లిస్తారు. జనవరి1, జులై1న వడ్డీ చెల్లిస్తారు. 2021 జనవరి 1న 7.15శాతం వడ్డీ కూపన్ చెల్లిస్తారు. తర్వాత మార్కెట్ లింకు ఆధారంగా నిర్దారిస్తారు. అయితే ఈ బాండ్లు బదిలీ చేయబడవు. అందేకాదు.. సెకండరీ ట్రేడింగ్ లో గ్యారెంటీగా కూడా వినియోగించకోవడానికి లేదు.

PSUల్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్స్

ఇన్వెస్టర్లు ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కూడా పరిశీలించవచ్చు. ఇందులో ఇటీవల కాలంలో భారీగా ర్యాలీ కనిపిస్తోంది. RBI రేట్ కట్, సర్ ప్లస్ లిక్విడిటీ కారణంగా మెరుగ్గా రాణిస్తున్నాయి. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ పై ప్రస్తుతం 4.15శాతం నుంచి 4.55శాతం మధ్య రాబడి కనిపిస్తోంది. ప్రీ ట్యాక్స్ గ్రాస్డ్ అప్ ఈక్వెలెంట్. సో... మీకు ఏది కరెక్టుగా ఉందో ఎంపిక చేసుకుని బెటర్ ఇన్వెస్ట్ మెంట్ తెలుసుకుని మంత్లీ, లేదా ఇయర్లీ, హాప్ ఇయర్లీ ఇన్ కం పొందవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story