INDIAN AIRLINES: భారత విమానయానానికి 'కొత్త రెక్కలు'

INDIAN AIRLINES: భారత విమానయానానికి కొత్త రెక్కలు
X
అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్‌లకు సిగ్నల్... విమానయాన రంగంలో ఇండిగో వాటా 65 శాతం...ఇటీవల నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులు ![WhatsApp Image 2025-12-25 at 13.30.19.jpeg](https://pub-9efd3dc90dc041f9813e07ae44fdce52.r2.dev/epaper/images/iM-j6Ha4-WhatsAppImage2025-12-25at13.30.19.jpeg) ***

దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి గండిపడనుంది. ఇన్నాళ్లూ ఇండిగో వంటి ఎయిర్‌లైన్స్‌ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉండేది. ఇకపై వారి ఆటలు సాగవు. దేశంలో కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అల్ హింద్ ఎయిర్ , ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్ ‌ సంస్థలు విమానాలు నడిపేందుకు ఆమోదం తెలిపింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లై‌ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు కేంద్ర పౌర విమాయాన శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌లను అందుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్ ఇప్పటికే ఎన్వోసీ అందుకోగా.. 2026 నుంచి దీని సేవలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

దే­శం­లో వి­మా­న­యాన రంగం వి­స్త­రి­స్తోం­ది. దే­శీయ వి­మా­న­యాన మా­ర్కె­ట్‌­లో భా­గ­స్వా­మ్యా­న్ని పెం­చా­ల­నే ఉద్దే­శం­తో కొ­త్త సం­స్థ­ల­కు ప్ర­భు­త్వం అను­మ­తు­లు మం­జూ­రు చే­సిం­ది. ప్ర­స్తు­తం తొ­మ్మి­ది దే­శీయ వి­మా­న­యాన సం­స్థ­లు మా­త్ర­మే నడు­స్తు­న్నా­యి. అక్టో­బ­ర్‌­లో ఫ్లై బిగ్ సం­స్థ సే­వ­లు ని­లి­పి­వే­య­డం­తో ఈ సం­ఖ్య తగ్గిం­ది. కే­ర­ళ­కు చెం­దిన అల్ హిం­ద్ గ్రూ­ప్ వి­మా­న­యాన రం­గం­లో­కి ప్ర­వే­శి­స్తోం­ది. ఫ్లై­ఎ­క్స్‌­ప్రె­స్ కూడా మా­ర్కె­ట్లో­కి ప్ర­వే­శిం­చ­డా­ని­కి ప్ర­య­త్ని­స్తు­న్న సం­స్థ­ల­లో ఒకటి. ఇప్ప­టి­కే అను­మ­తి పొం­ది­న­శం­ఖ్ ఎయి­ర్ వచ్చే ఏడా­ది వా­ణి­జ్య కా­ర్య­క­లా­పా­లు ప్రా­రం­భిం­చా­ల­ని భా­వి­స్తోం­ది. దే­శీయ వి­మా­న­యాన మా­ర్కె­ట్‌­లో ఇం­డి­గో, ఎయి­ర్ ఇం­డి­యా గ్రూ­ప్ (ఎయి­ర్ ఇం­డి­యా, ఎయి­ర్ ఇం­డి­యా ఎక్స్‌­ప్రె­స్) కలి­సి 90 శాతం వా­టా­ను కలి­గి ఉన్నా­యి. ఇం­డి­గో ఒక్క­టే 65 శాతం మా­ర్కె­ట్ వా­టా­ను కలి­గి ఉంది. ఈ ఆధి­ప­త్యా­న్ని తగ్గిం­చ­డా­ని­కి ప్ర­భు­త్వం కొ­త్త సం­స్థ­ల­ను ప్రో­త్స­హి­స్తోం­ది. ఇటీ­వల ఇం­డి­గో సం­క్షో­భం ఈ రం­గం­లో ఒకే సం­స్థ­పై ఆధా­ర­ప­డ­టం వల్ల కలి­గే నష్టా­ల­ను తె­లి­య­జే­సిం­ది.

కేం­ద్ర పౌర వి­మా­న­యాన శాఖ మం­త్రి కిం­జ­రా­పు రా­మ్మో­హ­న్ నా­యు­డు ఈ అను­మ­తుల గు­రిం­చి ఎక్స్ (ట్వి­ట్ట­ర్)లో పో­స్ట్ చే­శా­రు. శంఖ్ ఎయి­ర్, అల్ హిం­ద్ ఎయి­ర్, ఫ్లై­ఎ­క్స్‌­ప్రె­స్ బృం­దా­ల­తో మం­త్రి­త్వ శాఖ సమా­వే­శ­మైం­ద­ని, శంఖ్ ఎయి­ర్ ఇప్ప­టి­కే అను­మ­తి పొం­దిం­ద­ని, మి­గి­లిన రెం­డు సం­స్థ­ల­కు ఈ వారం NOC­లు అం­దా­య­ని ఆయన తె­లి­పా­రు. దే­శీయ వి­మా­న­యాన రంగం వే­గం­గా అభి­వృ­ద్ధి చెం­దు­తు­న్నం­దున, ఎక్కువ సం­స్థ­ల­ను ప్రో­త్స­హిం­చ­డ­మే తమ ప్ర­భు­త్వ వి­ధా­న­మ­ని నా­యు­డు పు­న­రు­ద్ఘా­టిం­చా­రు. ప్రాం­తీయ అను­సం­ధా­న­త­ను మె­రు­గు­ప­ర­చ­డా­ని­కి ఉద్దే­శిం­చిన ఉడా­న్ వంటి ప్ర­భు­త్వ పథ­కా­లు చి­న్న వి­మా­న­యాన సం­స్థ­ల­కు సహా­య­ప­డ్డా­య­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. ఉడా­న్ పథకం కింద, స్టా­ర్ ఎయి­ర్, ఇం­డి­యా వన్ ఎయి­ర్, ఫ్లై91 వంటి వి­మా­న­యాన సం­స్థ­లు సే­వ­లు తక్కువ ఉన్న మా­ర్గా­ల­లో తమ సే­వ­ల­ను వి­స్త­రిం­చా­యి. చి­న్న నగ­రా­ల­ను జా­తీయ వి­మా­న­యాన నె­ట్‌­వ­ర్క్‌­తో అను­సం­ధా­నిం­చ­డం­లో ఇవి కీలక పా­త్ర పో­షిం­చా­యి. ఈ వి­భా­గం­లో ఇంకా వృ­ద్ధి­కి అవ­కా­శం ఉం­ద­ని మం­త్రి తె­లి­పా­రు. డై­రె­క్ట­రే­ట్ జన­ర­ల్ ఆఫ్ సి­వి­ల్ ఏవి­యే­ష­న్ తాజా డేటా ప్ర­కా­రం.. ప్ర­స్తు­తం భా­ర­త­దే­శం­లో ఇం­డి­గో, ఎయి­ర్ ఇం­డి­యా, ఎయి­ర్ ఇం­డి­యా ఎక్స్‌­ప్రె­స్, ప్ర­భు­త్వ రంగ సం­స్థ అల­య­న్స్ ఎయి­ర్, ఆకాశ ఎయి­ర్, స్పై­స్‌­జె­ట్, స్టా­ర్ ఎయి­ర్, ఫ్లై91, ఇం­డి­యా వన్ ఎయి­ర్ వంటి వి­మా­న­యాన సం­స్థ­లు ఉన్నా­యి. గతం­లో జెట్ ఎయి­ర్‌­వే­స్, గో ఫస్ట్ వంటి వి­మా­న­యాన సం­స్థ­లు అప్పు­లు, ని­ర్వ­హణ సవా­ళ్ల­తో మూ­త­ప­డ్డా­యి. ఈ నే­ప­థ్యం­లో కొ­త్త వి­మా­న­యాన సం­స్థల రాక ఈ రంగం అస్థి­ర­త­ను కూడా తె­లి­య­జే­స్తోం­ది. ఇక ఇటీ­వల ఇం­డి­గో సం­క్షో­భం నే­ప­థ్యం­లో ఇం­డి­గో వి­మాన టి­కె­ట్ల రద్దు­పై 100 వరకు ఫి­ర్యా­దు­ల­ను తమ శాఖ అం­దు­కు­న్న­ట్లు, వా­టి­ని వి­మాన ని­యం­త్ర­ణా­ధి­కార సం­స్థ­కు పం­పి­న­ట్లు వి­ని­యో­గ­దా­రు వ్య­వ­హా­రాల కా­ర్య­ద­ర్శి నిధి ఖరే పే­ర్కొ­న్నా­రు.

Tags

Next Story