ఏవియేషన్ డీల్ పై స్పందించిన బ్రిటన్ ప్రధాని

ఎయిర్ బస్, ఇండిగో ఒప్పందం యూకేకు ఆదాయంతో పాటు ఎంతోమంది స్థానిక ప్రజలకు ఉద్యోగాలను ఇస్తుందన్నారు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో, విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం పై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ డీల్ తమ దేశ ఆర్థిక పురోగతికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా దానిపై ఇండిగో స్పందించి.
మరోవైపు ఒప్పందాన్ని కేంద్రమంత్రి జ్యోతి రాదిత్య సింథియా కూడా ప్రశంసించారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో, 500 విమానాల కొనుగోలుకు విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటివలే ఎయిరిండియా 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చి సంచలనం సృష్టించగా ఇప్పుడు ఇండిగో ఏకంగా 500 విమానాలకు ఆర్డర్ ఇవ్వడం రికార్డ్‌గా మారింది. విమాన ప్రయాణాలు చేస్తున్నవారి సంఖ్య పెరగడం, దేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ లో నిలబడేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని ఈ పరిణామాన్ని చూస్తే స్పష్టమవుతోంది.
ఐదు వందల ఏ320 విమానాల ఆర్డర్ అనేది కమర్షియల్ ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రికార్డ్ స్థాయి కొనుగోలు ఒప్పందమని ఎయిర్‌బస్ ప్రకటించింది. కాగా ఈ ఆర్డర్‌తో కలిపి ఇండిగో మొత్తం విమానాల సంఖ్య 1330కి చేరుతుంది. ఏ320 విమానాలు కలిగివున్న అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో నిలవనుందని ఎయిర్‌బస్ తెలిపింది.
అంతేకాకుండా అటు ఎయిర్‌బస్ సంస్థకు కూడా ఇదే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ డీల్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆ సంస్థకు ఇంత పెద్ద డీల్ చేతికి చిక్కలేదు. ఇప్పుడు ఇండిగో పెట్టిన ఆర్డర్‌లో ఏ 320 నియో, ఏ 321 నియో, ఏ 321 ఎక్స్‌ఎల్ఆర్ ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com