Indigo: ఇండిగో స్పెషల్ ఆఫర్.. రూ.915లతో విమాన ప్రయాణం

Indigo: ఇండిగో 15 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఛార్జీలను ప్రారంభించింది. దీని ప్రకారం, ఆఫర్ ఆగస్టు 4-6 తేదీల మధ్య ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ టికెట్‌తో సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చి 26, 2022 మధ్య ప్రయాణించవచ్చు.
15 సంవత్సరాల కార్యకలాపాలను పురస్కరించుకుని, ఎయిర్‌లైన్ దిగ్గజం ఇండిగో దేశీయ, అంతర్జాతీయ కనెక్షన్‌లపై రూ. 915 నుండి టికెట్ ధర ప్రారంభమవుతుంది. అన్నీ కలుపుకొని ఛార్జీలను అందించే మూడు రోజుల ధరను నిర్ణయించారు. ఈ ప్రత్యేక టికెట్ల అమ్మకాన్ని బుధవారం ప్రకటించింది.
ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోనోజోయ్ దత్తా మాట్లాడుతూ " ఇది మాకు ఒక ముఖ్యమైన సందర్భం. కరోనా కష్టకాలంలో కూడా మా కస్టమర్‌లు, ఉద్యోగుల మా పట్ల విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము."
ప్రస్తుతం, ఇండిగో 270 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. ఈ ఎయిర్‌లైన్స్ రోజువారీ 1,000 విమానాలను నడుపుతోంది. 67 దేశీయ గమ్యస్థానాలతో పాటు 24 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తోంది అని దత్తా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com