Influencer TDS: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు షాక్.. ఇకపై వాటికి ట్యాక్స్ కట్టాల్సిందే..!

Influencer TDS: ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు సమానంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల క్రేజ్ పెరిగింది. కొంతమంది స్టార్ నటీనటులకు కూడా లేనంతమంది ఫాలోవర్స్ ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఉన్నారు. అందుకే సినిమా ప్రమోషన్స్ అయినా.. బ్రాండ్ ప్రమోషన్స్ అయినా ఇన్‌ఫ్లూయెన్సర్లదే హవా. కానీ ఇప్పుడు ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఊహించని షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం.
కొన్నిసార్లు ప్రమోషన్ చేయడం కోసం ఇన్‌ఫ్లూయెన్సర్ల పారితోషికం లాంటివి అందిస్తాయి బ్రాండ్లు. కానీ ఒక్కొక్కసారి వారి బ్రాండ్‌కు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ఇచ్చి పబ్లిసిటీ చేయమంటాయి. అయితే అలా ఫ్రీగా ప్రమోషన్స్ చేయడం కోసం తీసుకునే బ్రాండ్లపై ఇకపై ట్యాక్స్ కట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఒకవేళ ప్రమోషన్ తర్వాత ఆ వస్తువులను ఇన్‌ఫ్లూయెన్సర్లు తిరిగి ఇచ్చేస్తే ట్యాక్స్ అవసరం లేదు కానీ ఉంచుకుంటూ మాత్రం 10 శాతం టీడీఎస్ కట్టాల్సిందే అని సీబీడీటీ వెల్లడించింది
సెక్షన్ 194 ఆర్ టీడీఎస్ నిబంధనల ప్రకారం ఇన్‌ఫ్లూయెన్సర్లు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని సీబీడీటీ నిర్ణయించింది. కార్లు, టీవీలు, మొబైల్ ఫోన్‌లు, ఫ్రీ టిక్కెట్‌లు, విదేశీ పర్యటనల వంటివాటిపై టీడీఎస్ వర్తించనుంది. ఇది ఇన్‌ఫ్లూయెన్సర్లకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియాను శాసించే స్థానానికి వచ్చిన తర్వాత ఇన్‌ఫ్లూయెన్సర్లు.. ఈ ప్రమోషన్స్ ద్వారానే రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇకపై వారిపై ఈ టీడీఎస్ భారం కూడా పడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com