Instagram: రీల్స్ చేసేవారికి ఇన్‌స్టాగ్రామ్ గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో..

Instagram: రీల్స్ చేసేవారికి ఇన్‌స్టాగ్రామ్ గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్లతో..
Instagram: ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. అన్నీ మెటా యాజమాన్యంలోని ఉన్నాయి.

Instagram: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్ ప్లేస్‌లో ఉందంటే ఆశ్చర్యం లేదు. ఫోటో షేరింగ్ యాప్‌గా ప్రారంభమయిన ఇన్‌స్టా్గ్రామ్.. ఆ తర్వాత లేటెస్ట్ ట్రెండ్స్‌కు సరిపోయేలాగా తన ఫీచర్స్‌ను మార్చుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే యూజర్స్ సంఖ్య పెరిగిపోతోంది కాబట్టి ప్రత్యేకంగా వారి కోసం మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది ఇన్‌స్టాగ్రామ్.

ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. అన్నీ మెటా యాజమాన్యంలోని ఉన్నాయి. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తున్న రీల్స్‌ను డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేసే అవకాశం కల్పించేలా ఫీచర్ రానుంది. ఈ ఫీచరే ఇన్‌స్టాగ్రామ్ టు ఫేస్‌బుక్ క్రాస్ పోస్టింగ్. దీంతో పాటు పెట్టిన స్టోరీలను ఎలా అయితే హైలెట్ చేసుకుంటున్నారో అలాగే రీల్స్‌ను కూడా హైలెట్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు హైలెట్ చేసినప్పుడు దానికి 'యాడ్ యువర్ స్టికర్' అనే ఫీచర్ లభిస్తోంది. ఇదే ఫీచర్ త్వరలో రీల్స్‌కు కూడా అప్లై చేసుకునే సౌలభ్యం కలిపించనుంది ఇన్‌స్టాగ్రామ్. ప్రస్తుతం ఈ ఫీచర్స్ అన్నీ టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయని, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానున్నాయని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి తన ట్విటర్ ద్వారా తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story