Investment: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Investment: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Investment: భూమిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం రాదు.. కాస్త డబ్బు ఉంటే ఒక సెంటు భూమి అయినా కొనిపెట్టుకో.. అవసరానికి అక్కరకు వస్తుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు..

Investment: భూమిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం రాదు.. కాస్త డబ్బు ఉంటే ఒక సెంటు భూమి అయినా కొనిపెట్టుకో.. అవసరానికి అక్కరకు వస్తుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. అది నిజమే అంటున్నారు రియల్ మార్కెట్ విశ్లేషకులు. దీర్ఘకాలంలో స్థిరాస్థిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరిదేంట్లోనూ రాదని తాజాగా నిర్వహించిన ఓ సర్వే తెలిపింది.

సొంత ఇల్లు ఉన్నా మరో ఫ్లాట్ కొనడానికి మొగ్గు చూపుతున్నారు.. అద్దెలు వస్తుంటాయి.. ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా పనికొస్తుంది. పది, పదేహేనేళ్లకు పెట్టిన పెట్టుబడి డబుల్ అవుతుంది. మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే స్థిరాస్తి దీర్ఘకాలానికి అత్యంత సురక్షితం. స్వల్పకాలంలోనూ ఒడిదుడుకులు తక్కువే. ఆర్థిక మందగమనం వంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా ఇబ్బందులు తక్కువ అని 82 శాతం మంది చెప్పారు.

మన పెట్టుబడి మీద వచ్చే రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. ఏదైనా స్థిరాస్థి కొనుగోలు చేసినప్పుడు వెంటనే అమ్మాలని చూడకుండా కనీసం ఐదు, పదేళ్లు వేచి చూడగలిగితే తప్పకుండా అధిక రాబడి వస్తుందని చెబుతున్నారు. కొన్నిసార్లు ఒకటి రెండేళ్లలోనే వృద్ధి కనిపించినా అన్ని సమయాల్లో, అన్ని చోట్లా అది సాధ్యం కాదు.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఎంతో కొంత పొదుపు చేసి, సరదాలను సంతోషాలను పక్కన పెట్టి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు చాలా మంది. అయితే గడువు లోపలే ఇస్తామని ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులు ఆలస్యం కావడం, ఇటు ఇంటి అద్దె అటు ఈఎమ్‌ఐ భరించలేక వెనుకడుగు వేసేవారు దాదాపు 38 శాతం మంది ఉన్నారు.

ఇల్లు కొనడం చాలా మంది జీవితంలో అతి పెద్ద నిర్ణయం. అనుకోని కారణాలతో స్థిరాస్థి కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగం పోతే వ్యాపారంలో నష్టం వచ్చి ఈఎంఐ చెల్లించలేని పరిస్థితులు ఎదురైతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చాలా మంది ఇల్లు కొనకుండా వాయిదా వేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రెండేళ్లపాటు ఈఎంఐ చెల్లించకపోయినా ఎగవేతదారుగా భావించకుండా ఉండాలని 94 శాతం మంది కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story