iPhone 12 Price: ఐఫోన్ 12పై ఏకంగా రూ.11,901 తగ్గింపు.. ఎక్కడంటే..

iPhone 12 Price: స్మార్ట్ ఫోన్లలో ఖరీదైన ఫోన్ ఏదంటే ఎవరైనా చెప్పగలిగే సమాధానం ఐ ఫోన్. ఒకప్పుడు ఐ ఫోన్ అనేది కేవలం డబ్బున వారు మాత్రమే ఉపయోగిస్తారు అన్న అపోహ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ స్మార్ట్ ఫోన్‌ను ఎంత ఖర్చు పెట్టైనా కొనే జెనరేషన్ ఇది. అయితే ఐఫోన్ లవర్స్‌ను ఓ వార్త ఖుషీ చేస్తుంది. అదే ఐఫోన్ 12 ధర విపరీతంగా తగ్గింది.
ప్రస్తుతం నేరుగా షాప్‌లకు వెళ్లి కొనడం కంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు వినియోగదారులు. అయితే తాజాగా అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్స్‌లో ఐ ఫోన్ 12 ధర చూసిన యూజర్లకు దిమ్మదిరిగిపోయింది. ఈ రెండు ఈ షాపింగ్ సైట్స్‌లో ఐ ఫోన్ 12 ధరలు విపరీతంగా పడిపోయాయి.
మామూలుగా ఐ ఫోన్ సిరీస్‌లో ఒక్క కొత్త ఫోన్ లాంచ్ అయ్యిందంటే పాత వర్షన్ ధర ఆటోమాటిక్‌గా తగ్గిపోవాల్సిందే. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 64 జీబీ ఐఫోన్ వర్షన్‌పై ఏకంగా రూ.11,901 తగ్గింది. మామూలుగా మార్కెట్‌లో దీని ప్రైజ్ రూ.65,900. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఇది రూ.53,999కే లభిస్తోంది. అమేజాన్‌లో పలు డిస్కౌంట్‌లతో ఐఫోన్ ధర కాస్త తక్కువగా ఉన్నా ఫ్లిప్‌కార్ట్‌లోనే ఐఫోన్ 12 చాలా తక్కువ ధరకు లభిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com