రూ.30,900కే ఐ ఫోన్, ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్

Iphone 14
ఐ ఫోన్-14 పై ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర 69,999 గా ఉంది. ఇది యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో కన్నా రూ.9,901 తక్కువ. కానీ ఐఫోన్ 14ని ఇప్పుడు కేవలం రూ.30,900కే పొందవచ్చు. పలు ఆఫర్ల ద్వారా దీనిపై రూ.35,000 దాకా భారీ తగ్గింపు ఇస్తోంది.
క్యాంపస్ డీల్ తగ్గింపులో భాగంగా, యువతను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్‌ని తెచ్చింది. సాలిడ్ ఫీచర్లతో లోడై ఉన్న ఈ ఐ ఫోన్-14ని ఉపయోగించాలనుకునే యువతకు ఇది చక్కటి అవకాశం.
ఆఫర్‌ని పొందడం ఇలా..
ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లో ఐ ఫోన్-14 ని సెలెక్ట్ చేసుకొని, పేమెంట్ చేయడానికి ప్రొసీడ్ అవ్వాలి. దీని కొనుగోలుకు వినియోగదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ EMI చెల్లింపు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతిలో ఈ కార్డుపై సుమారు రూ.4000 దాకా తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటుగా మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసినట్లయితే, ఫోన్ బ్రాండ్, మోడళ్ల ఆధారంగా మరో రూ.35,౦౦౦ దాకా తగ్గింపు లభిస్తుంది.
ఈ రెండు ఆఫర్లని వినియోగదారులు ఉపయోగించుకున్నట్లయితే దాదాపుగా రూ.48,901 దాకా భారీ డిస్కౌంట్ లభించనుంది.
ఐ ఫోన్-14 ఫీచర్స్..
ఓఎస్: iOS 16
చిప్‌సెట్ : యాపిల్ A15 బయోనిక్ (5nm)
స్క్రీన్ సైజ్: 6.1 ఇంచ్
డిస్‌ప్లే : సూపర్ రెటీనా XDR OLED, ౧౧౭౦క్స౨౫౩౨ పిక్సెల్స్, (~460 PPI)
కెమెరా: 12MP+12MP
స్టోరేజ్ సామర్థ్యం: 64 GB / 256 GB / 512 GB
బ్యాటరీ సామర్థ్యం: 2900 mAh
కనెక్టివిటీ(అనుసంధానత): వైఫై, 4G, బ్లూటూత్ 5.0
సెన్సార్స్ : ఫేస్ ఐడీ, ప్రాక్సిమిటీ, యాక్సెలరోమీటర్, కంపాస్
ప్రతీ సంవత్సరం పలు నూతన ఫీచర్లతో యాపిల్ కొత్త ఫోన్లు, ఇతర స్మార్ట్ డివైజెస్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకూనే ఉంటోంది. త్వరలోనే ఐ ఫోన్-14 విడుదల చేయబోతోంది. ఇటీవలె యాపిల్ విజన్ ప్రో అనే స్మార్ట్ పరికరాన్ని విడుదల చేసింది. ఇది వచ్చే సంవత్సరం మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com