రూ.20వేలతో ఆమె స్టార్ట్ చేసిన వ్యాపారం..ఇప్పుడు రూ.1000 కోట్లు దాటింది

రూ.20వేలతో ఆమె స్టార్ట్ చేసిన వ్యాపారం..ఇప్పుడు రూ.1000 కోట్లు దాటింది

Rajni Bector (File Photo)

ఆమెకు తెలిసినవాళ్లకు తన వంటకాలు, ఐస్ క్రీమ్‌లు తినిపించి ఎలా ఉన్నాయని అడిగేవారు. అలా మొదలైన ప్రస్తానం.. మెల్లగా వ్యాపారంగా మారింది.

మిసెస్ బెక్టార్స్ ఫుడ్స్.. మన సౌతిండియాలో పెద్దగా పాపులర్ కాదు కానీ.. నార్త్ ఇండియాలో ప్రతి ఇంటిని పలకరించే పేరు ఇది. అంతర్జాతీయ బ్రాండ్స్ దేశంలో పాగా వేస్తున్నా.. తట్టుకుని ఆ కంపెనీలకు ఉత్పత్తులకు అందిస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఓ మహిళ సక్సెస్ స్టోరీ ఇది. ఆమె రజనీ బెక్టార్స్. స్టాక్ మార్కెట్లో IPOకు వచ్చి సుమారు 200 రెట్లు సబ్ స్క్రైబ్ అయిన కంపెనీగా ఘనత సాధించిన మిసెస్ బెక్టార్స్ ఫుడ్స్ అధినేత్రి. మోస్ట్ సక్సెస్ ఫుల్ విమెన్ గా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి తెలుసుకోవాల్సిందే.

రజనీ బెక్టార్ కరాచిలో జన్మించారు. దేశ విభజన సమయంలో కుటుంబంతో పాటు.. ఢిల్లీకి వచ్చారు. 17 ఏళ్ల వయసులో లుధియానాకు చెందిన ధరంవీర్ బెక్టార్ ను పెళ్లి చేసుకున్నారు. పిల్లలు బోర్డంగ్ స్కూల్ లో చేరడంతో ఆమెకు పొద్దు పోయేది కాదు. దీంతో మెల్లగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. ఆలోచన మారకముందే అగ్రికల్చర్ వర్శిటీలో కుకింగ్ కోర్సు చేశారు. కోర్సు చేసిన అనుభవంతో తెలిసినవాళ్లకు తన వంటకాలు, ఐస్ క్రీమ్‌లు తినిపించి ఎలా ఉన్నాయని అడిగేవారు. అలా మొదలైన ప్రస్తానం.. మెల్లగా వ్యాపారంగా మారింది. మొదట్లో ఆమె తక్కువ ధరకే ఫన్ ఫెయిర్స్ లో అమ్మేవారు. కొంత నష్టం వచ్చినా సంతృప్తిని మిగిల్చింది ఆమె వేసిన మొదటి అడుగు. అయితే భర్త దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. కుకింగ్‌ని వ్యాపారంగా మార్చమని భార్యకు సలహా ఇచ్చారు. ఆయన సలహా ఆమెకూ నచ్చడంతో రూ.20వేల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టారు. ఐస్ క్రీమ్ ఆర్డర్లు పెద్ద ఎత్తున తీసుకోవడం మొదలుపెట్టారు. తరువాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని బిస్కెట్లు, కుకీస్ కు విస్తరించారు.

1990లో ఇండియాలోకి మెక్ డొనాల్డ్స్ అడుగుపెట్టింది. అప్పటికే స్థానికంగా బేకరీ రంగంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు సంపాదించిన క్రిమికా... అంతర్జాతీయ కంపెనీతో డీల్ చేసుకుంది. వాళ్లకు అవసరమైన బేకరీ ఉత్పత్తులు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మిల్క్ షేక్ సిరప్, కెచప్ వంటివి సరఫరా చేయడం మొదలుపెట్టారు. 1996 నుంచి మెక్ డొనాల్డ్స్ కంపెనీ పూర్తిగా రజనీ బెక్డార్ స్థాపించిన క్రిమికా ఉత్పత్తులపై ఆధారపడింది. అంతేకాదు.. చుట్టుపక్కల దేశాలకు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్లేది. దీంతో బెక్టార్స్ ఫుడ్స్ వ్యాపారం భారీగా పెరిగింది. 2006 నాటికి కంపెనీ ఆదాయం రూ.100 కోట్లు దాటింది. ప్రతి ఏటా 30శాతం గ్రోత్ నమోదు చేసింది. అలా 2020 నాటికి 1000 కోట్ల టర్నోవర్‌కు చేరింది.

ఇక కంపెనీకి ఇన్వెస్టర్లు వచ్చారు. కొత్త కంపెనీలకు ఉత్పత్తులకు సరఫరా చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ప్రీమియం, మిడ్ ప్రీమియం బిస్కెట్, బేకరీ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ కంపెనీగా అవతరించింది. మొత్తం 60 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నాలుగు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం 6 యూనిట్లు ఉన్నాయి.

తాజాగా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తూనే రికార్డులు సృష్టించింది. ఈ మొత్తం సక్సెస్ స్టోరీలో మిసెస్ రజనీ బెక్టార్ ఉన్నారు. ఆమె రూ.20వేలతో మొదలుపెట్టిన వ్యాపారం 200 రెట్లు పెరిగి IPOలో సబ్ స్క్రైబ్ చేసుకునే స్థాయికి చేరుకుంది.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story