ITR: ఫారం 16 విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి!

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే సమయంలో ఫారం 16 ముఖ్యమైన పత్రం. ఉద్యోగులు తమ యజమాని నుండి ఈ పత్రాన్ని పొందుతారు. ఇది జీతం నుంచి TDS (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాలను చాటి చెబుతుంది. అయితే ఫారం 16 విషయంలో చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. అసలు ఇది ఎప్పుడు వస్తుంది? అందకపోతే ఏం చేయాలి? ఫారం 16 లేకుండానే రిటర్న్ వేయొచ్చా? అనే ప్రశ్నలకు చాలా మందికి జవాబు తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫారం 16 ఎప్పుడు వస్తుంది?
యజమానులు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరైన తర్వాత మార్చి త్రైమాసికానికి సంబంధించిన e-TDS రిటర్న్‌ను మే 31లోపు దాఖలు చేయాలి. దాఖలైన తర్వాత 15 రోజులలోపు, అంటే జూన్ 15లోపు, ఉద్యోగికి ఫారం 16 ఇవ్వాలి. ఇది ఒక చట్టబద్ధమైన బాధ్యత. ఆలస్యం చేస్తే ప్రతి రోజు రూ. 500 జరిమానా వసూలు చేయవచ్చు (గరిష్ఠంగా TDS మొత్తం వరకూ).
ఫారం 16 ఎవరికి వస్తుంది?
మీ జీతం నుంచి TDS కోత పడితే మాత్రమే ఫారం 16 జారీ అవుతుంది. లేకపోతే రావడం ఉండదు.
ఫారం 16లో ఏం ఉంటుంది?
ఫారం 16లో పార్ట్ A, పార్ట్ B అనే రెండు భాగాలు ఉంటాయి
పార్ట్ A: ఉద్యోగి, యజమాని వివరాలు, PAN-TAN నంబర్లు, త్రైమాసికాల TDS వివరాలు.
పార్ట్ B: మొత్తం జీతం, మినహాయింపులు, డిడక్షన్లు, టాక్స్ రెజిమ్ ఎంపిక వంటి వివరాలు.
TRACES లోగో తప్పనిసరి!
ఫారం 16పై TRACES లోగో ఉండాలి. తప్పుడు పత్రాల నుండి దూరంగా ఉండేందుకు చట్టబద్ధ గుర్తింపు.
ఫారం 16 రాకపోతే?
జూన్ 15లోపు రాకపోతే HR/Finance డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలి.
అయినా రాకపోతే ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేయొచ్చు.
ప్రత్యామ్నాయంగా ఫారం 26AS, AIS స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్‌లు ఉపయోగించి ITR ఫైల్ చేయవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు ఫారం 16లు వచ్చాయంటే?
వేర్వేరు కంపెనీలకు పనిచేస్తే, ప్రతి యజమానితో సంబంధించి ఒక ఫారం 16 వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com