Jeff Bezos : జెఫ్ బెజోస్ అంత పెద్ద కోటీశ్వరుడా.. ఎంతుంటుందేటి ఆయన ఆస్తి?

Jeff Bezos : జెఫ్ బెజోస్ అంత పెద్ద కోటీశ్వరుడా.. ఎంతుంటుందేటి ఆయన ఆస్తి?
దసరా వస్తే చాలు.. అవసరం లేకపోయినా ఆఫర్ల కోసం ఆ యాప్ లోనే కొనేస్తాం. ఆ యాప్ పేరు అమెజాన్. దానిని స్టార్ట్ చేసింది జెఫ్ బెజోస్. ప్రపంచానికే కోటీశ్వరుడు.

మీకో ఫోన్ కావాలి.. వెంటనే ఏ యాప్ లో బుక్ చేస్తారు?

మీరు కరెంట్ బిల్ పే చేయాలి.. ఏ సైట్ లో చెల్లిస్తారు?

దసరా వస్తే చాలు.. అవసరం లేకపోయినా ఆఫర్ల కోసం ఆ యాప్ లోనే కొనేస్తాం. ఆ యాప్ పేరు అమెజాన్. దానిని స్టార్ట్ చేసింది జెఫ్ బెజోస్. ప్రపంచానికే కోటీశ్వరుడు. కానీ ఇప్పుడు జస్ట్ మిస్. కొద్దిలో ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కి దిగాల్సి వచ్చింది. సరే.. సంపదలో నెంబర్ తేడా వచ్చింది కాని.. ఆలోచనల్లో కాదు. అందుకే ఆయన గ్రోత్ ఇండెక్స్ రయ్ రయ్ మని దూసుకుపోతూనే ఉంది.

జెఫ్ బెజోస్ అంత పెద్ద కోటీశ్వరుడా.. ఎంతుంటుందేటి ఆయన ఆస్తి? అన్న క్వశ్చన్ చాలామందికి వస్తుంది.. సింపుల్ గా చెప్పాలంటే.. 200 బిలియన్ డాలర్లు. మూడు పదాల్లో ముచ్చటగా బెజోస్ ఆస్తెంతో చెప్పేశాం కదా అని లైట్ తీసుకోవద్దు. జెఫ్ బెజోస్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చేమో కాని అమెజాన్ పేరు తెలియనివారు ఎవరుంటారు? అలాంటి సంస్థను అప్పుడెప్పుడో 1994లో అమెరికాలోని సియాటెల్ లో స్థాపించాడు. అది కూడా ఓ గ్యారేజ్ లో మొదలైంది దాని ప్రస్థానం. అలాంటి సంస్థ.. ఇప్పుడు ప్రపంచంలోనే ఈకామర్స్ సంస్థల్లో నెంబర్ వన్ గా నిలిచింది. ఈ ప్లేసేమో అంత ఈజీగా రాలేదు. దాని వెనుక బెజోస్ పడ్డ కష్టాన్ని చూస్తే.. ఒక మనిషి ఇంతలా పనిచేయగలా.. అంతలా ఆలోచించగలడా అనిపిస్తుంది.

లక్షలు జీతం, మంచి హోదా ఉన్న జాబ్ ని ఎవరైనా వదిలేస్తారా? అది కూడా సక్సెస్ అవుతుందో లేదో తెలియని వ్యాపారం కోసం విడిచిపెడతారా? రిస్క్ చేస్తేనే కదా.. రిజల్ట్ వచ్చేది. బెజోస్ చేసింది అదే. అమెజాన్ అనే ఒక వెబ్ సైట్ ని ప్రారంభించి... ఆన్ లైన్ లో లో పుస్తకాలు అమ్ముకుంటుంటే జెఫ్ ని అందరూ ఓ పిచ్చోడిలా చూశారు. కానీ.. ఇప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో అయితే ఒకటో స్థానం.. కాదంటే రెండో స్థానం. అంతే.. అంతకుమించి కిందకు వచ్చే ప్రసక్తే లేదు.

అమెజాన్ వెబ్ సైట్ ప్రయాణం కాస్తా.. సంస్థగా మారింది. 1997లో మొదటిసారిగా అమెజాన్ పెట్టుబడుల కోసం స్టాక్ మార్కెట్లో లిస్టు అయింది. అలా చేరిన కొద్ది రోజులలోనే అమెజాన్ షేర్ వేల్యూ పెరిగి 100 డాలర్లకి చేరుకుంది. అలా మంచి లాభాలతో దూసుకుపోతున్న సమయంలోనే.. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన "డాట్ కం బబుల్" వల్ల అమెజాన్.. తన సంపాదనంతా కోల్పోవాల్సి వచ్చింది. మరొకరికైతే గుండాగినంత పనయ్యేది. కానీ అక్కడున్న జెఫ్ బెజోస్. అలాంటి కష్టాలకు కుంగిపోయే మనిషి కాదు. ఇలాంటి బాధలకు నలిగిపోయే మనసూ లేదు. అందుకే పట్టుదలతో, ధైర్యంతో, తెలివిగా మరో అడుగు ముందుకు వేశాడు.

జెఫ్ బెజోస్ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. అందుకే 2002 నాటికి అమెజాన్ మళ్లీ లాభాల బాటపట్టి పట్టింది. మొదసారిగా 5 మిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. ఒక కంపెనీనిని స్థాపించి ఎలాంటి లాభాలు లేకుండా ఆరేడేళ్ల పాటు నడపడం అంటే మాటలు కాదు. కానీ లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి.. లాభాలు సంపాదించాలన్న పట్టుదల, సక్సెస్ అవుతామన్న బెజోస్ నమ్మకం గెలిచింది. అందుకే అక్కడి నుంచి జెఫ్ ఇక వెనక్కి తిరిగి చుస్కోలేదు. అంతలా అమెజాన్ అంటే ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాడు జెఫ్. ప్రస్తుతం అమెజాన్ కు ఒక సెకనుకి కొన్ని వందల ఆర్డర్ లు వస్తున్నాయి. ఒకసారి అమెజాన్ వెబ్ సైట్ కొన్ని సాంకేతిక లోపాల వల్ల 40 నిమిషాల పాటు ఆగిపోయింది. మామూలుగా అయితే.. ఓస్.. 40 నిమిషాలే కదా అనుకుంటారు. కానీ బెజ్స్ కు ఆ 40 నిమిషాల ఖరీదు ఎంతో తెలుసా.. 39 కోట్ల రూపాయిలు. అంటే జస్ట్ ఫార్టీ మినిట్స్ సైట్ ఆగిపోవడంతో బెజోస్ కు వచ్చిన నష్టం 39 కోట్ల రూపాయిలు.

కరోనా రక్కసి వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. దీంతో డోర్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతోమంది తట్టాబుట్టా సర్దేసుకున్నారు. కానీ బెజోస్ అలా చేయలేదు. కరోనా సందర్భాన్ని కూడా తెలివిగా క్యాష్ చేసుకున్నాడు. అందరూ హోమ్ డెలివరీలనే కోరుకోవడం.. బెజోస్ లాభాల పంట పండించింది. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం అవడంతో ఎక్కువగా నెట్ పైనే కూర్చున్నారు. ఇంకేముంది.. అమెజాన్ సర్వీసులన్నింటినీ విస్తృతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆన్ లైన్ షాపింగ్ కోసం బాగా ఖర్చుపెట్టారు. దీంతో అమెజాన్ కు ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చి పడ్డాయి. దీనివల్ల అమెజాన్ ఆదాయం 38 శాతం పెరిగింది. దీంతో దాని సంపాదన 386 బిలియన్ డాలర్లకు చేరి.. జెఫ్ బెజోస్ ని ప్రపంచ కుబేరుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ కు చేర్చింది. గత వారం ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలవగా, రెండో స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు. కానీ ఇప్పుడు ఇద్దరి ప్లేసులు తారుమారయ్యాయి.

ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒక చోట కాస్త రిలాక్స్ అయితే చాలు.. కోట్లకు కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. నెంబర్ వన్ ప్లేసు కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బెజోస్ పరిస్థితి కూడా అదే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అయితేనే ముందుకు సాగుతారు. ఎలోన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్. ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైన వారం లోపే ప్లేసులు మారిపోవడంతో.. ఫోర్బ్స్ మేగజైన్ మళ్లీ మరో లిస్టును రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇందులో టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ ఫస్ట్ ప్లేస్ కు చేరారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. టెస్లా షేర్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఎలాన్ మస్క్ టాప్‌లోకి దూసుకొచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్ పాయింట్‌కు చేరుకున్న టెస్లా షేర్ల ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఆయన సంపాదన 3.8 బిలియన్ డాలర్లు పెరగడంతో మొత్తం సంపద విలువ 203.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తాజా జాబితా ప్రకారం ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానం ఇప్పుడు ఎలాన్ మస్క్‌ది కాగా, రెండో స్థానంలో జెఫ్ బెజోస్, మూడో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్, నాలుగో స్థానంలో బిల్‌గేట్స్, అయిదో స్థానంలో మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. కొద్దికాలంగా అమెజాన్ షేర్లు మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి.

అటు అమెజాన్ స్టాక్ 0.6 శాతం పడిపోవడంతో బెజోస్ సంపద 197.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో టెస్లా వ్యాపారంలో వృద్ధి నమోదైంది. స్పేస్‌ ఎక్స్ ద్వారా నలుగురు సాధారణ వ్యక్తులను అంతరిక్షంలోకి పంపిన ప్రయోగం విజయవంతం కావడం కూడా టెస్లా షేర్ల పెరుగుదలపై ప్రభావం చూపించింది. ఎలాన్ మస్క్ 2 వందల బిలియన్ డాలర్లను చేరుకున్న మూడో వ్యక్తిగా నిలిచారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ గత ఏడాది ఆగస్టులోనే ఈ ఫీట్ సాధించగా, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ మాత్రం గత నెలలో 2 వందల బిలియన్ మార్క్ చేరుకున్నారు.Tags

Read MoreRead Less
Next Story