Jio Phone Next: రూ.1,999తో జియో ఫోన్ నెక్ట్స్ మీ సొంతం.. ఈఎంఐ చెల్లించడానికి నాలుగు ప్లాన్లు..

Jio Phone Next (tv5news.in)
Jio Phone Next: ముఖేశ్ అంబానీ ఏం చేసినా బిజినెస్ రంగం అంతా ఒక్కసారిగా తిరిగి చూసేలాగానే ఉంటుంది. ముఖ్యంగా 'జియో'ను ప్రవేశపెట్టిన తర్వాత అంబానీ ప్రతీ ఒక్క మిడిల్ క్లాస్ మనిషికి కూడా చాలా దగ్గరయ్యారు. జియో ఫోన్, జియో నెట్‌వర్క్ ఒక్కసారిగా వాణిజ్య రంగంలో పెద్ద విప్లవాన్నే సృష్టించాయి. తాజాగా అంబానీ.. మరో జియో స్మార్ట్‌ఫోన్‌తో సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
'జియో ఫోన్ నెక్ట్స్' పేరుతో త్వరలోనే లాంచ్ కానున్న ఫోన్ గురించి ఇప్పటికే వాణిజ్య రంగంలో హైలైట్ అవుతోంది. దీపావళి సందర్భంగా విడుదల కానున్న ఈ ఫోన్ ఈఐఎంఐతో పాటు వాయిస్ కాల్స్, డేటా వివరాల గురించి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా చెప్పారు.
'జియో ఫోన్ నెక్ట్స్'ను కొనుగోలు చేయడానికి రూ.1,999 డౌన్ పేమెంట్ చేస్తే చాలు. ఇక ఈఎంఐ పేరుతో అందరిపై అధిక భారం వేయకుండా కేవలం రూ. 300 చెల్లిస్తే చాలు అంటోంది జియో సంస్థ. ఈ ఈఎంఐను చెల్లించడానికి 18 నెలలు, 24 నెలలు లాంటి రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఇక 'జియో ఫోన్ నెక్ట్స్' ధర భారదేశంలో రూ. 6,499 ఉండనుంది.
'జియో ఫోన్ నెక్ట్స్'తో పాటు నాలుగు ప్లాన్‌లను కూడా యూజర్లకు అందిస్తున్నారు అంబానీ. ఈ నాలుగు ప్లాన్‌లలో మనం కట్టాల్సిన ఈఎంఐ ఎమౌంట్ మారుతూ ఉంటుంది. వినియోగదారుల సౌలభ్యాన్ని బట్టి ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు అంటోంది జియో సంస్థ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com