Kia Sorento: కియా కార్ల క్రేజ్ అదిరిందిగా..! ముఖ్యంగా ఆ మోడల్‌లో..

Kia Sorento: కియా కార్ల క్రేజ్ అదిరిందిగా..! ముఖ్యంగా ఆ మోడల్‌లో..
Kia Sorento: కియా.. ఈ సంస్థ కారులంటే చాలామందికి ఇష్టం. అందుకే కియా మోటర్లకు దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటుంది.

Kia Sorento: రోజురోజుకీ మార్పు చెందే రంగాల్లో ఆటోమొబైల్ కూడా ఒకటి. మారుతున్న టెక్నాలజీతో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అలాగే ఆటోమొబైల్ రంగంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు సహజం. అయితే ఆటోమొబైల్ రంగంలో ఉండే పోటీని నిర్ణయించడానికి ఎన్నో సర్వేలు జరుగుతుంటాయి. తాజాగా అలా జరిగిన ఓ సర్వేలో ఇండియన్స్ బాగా ఇష్టపడే కారు ఏదో తెలిసిపోయింది.

కియా.. ఈ సంస్థ కారులంటే చాలామందికి ఇష్టం. అందుకే కియా మోటర్లకు దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంటుంది. ఎప్పుడైనా సేల్స్ విషయంలో కియా వెనక్కి తగ్గదు. తాజాగా అంతర్జాతీయంగా జరిగిన ఓ సర్వేలో కూడా ఇదే వెల్లడైంది. అమ్మకాలు మాత్రమే కాదు మన్నిక విషయంలో కూడా కియానే నెంబర్ వన్ అంటోంది ఈ సర్వే.

మూడేళ్లకు పైగా ఫోర్ వీలర్ ఉపయోగించిన వారందరికీ ఓ సర్వే నిర్వహించింది ఓ ప్రైవేట్ సంస్థ. అందులో రిపేర్లు, కాంపోనెంట్స్‌ రిప్లేస్‌మెంట్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, వెహికల్‌ అప్పీల్‌ తదితర అంశాలపై యజమానుల నుంచి వివరాల సేకరణ జరిగింది. ఈ సర్వేలో మొత్తం 31 కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నారు.

అయితే ఈ సర్వేలో కియాకు చెందిన అప్పర్‌ మిడ్‌రేంజ్‌ ఎస్‌యూవీ సొరెంటోకే అందరూ ఓటు వేశారు. ఈ కారు తయారీ జార్జియాలోని కియా ప్లాంటులో జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఈ మోడల్ కియా కారు ఇండియన్ మార్కెట్‌లో లభించడం లేదు. కాకపోతే త్వరలోనే మిడ్‌రేంజ్‌ ఎస్‌యూవీ సొరెంటోను ఇండియాలో కూడా విక్రయించనున్నట్టు సంస్థ వెల్లడించింది. అయితే దీని ధర రూ. 25 లక్షలు ఉండనున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story