లక్ష్మీవిలాస్ బ్యాంకుపై మారిటోరియం

లక్ష్మీవిలాస్ బ్యాంకుపై మారిటోరియం

లక్ష్మీ విలాస్ బ్యాంక్ పై మారిటోరియం విధిస్తూ ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 16వరకూ అంటే నెలరోజుల పాటు మారిటోరియం అమల్లో ఉంటుంది. తాజా నిర్ణయంతో కస్టమర్లు తమ ఖాతాలనుంచి రూ.25వేలకు మంచి విత్ డ్రా చేయడానికి వీల్లేదు. అయితే డిపాజిటర్లు అంతకుమించి అత్యవసర పరిస్థితుల్లో విత్ డ్రా చేయాలనుకుంటే RBI అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వివాహాలు, ఉన్నతవిద్య, ఆసుపత్రి బిల్లల చెల్లింపుల వంటి వాటిని ప్రత్యేకంగా అనుమతి ఇస్తారు.

బ్యాంకు ఆర్థిక పరిస్థితిని ద్రుష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని RBI ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 45 కింద డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు అనివార్యంగా నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

Also Read:profit your trade


Tags

Next Story