LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభమైంది.. మే 9లోపు అప్లై..

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభమైంది.. మే 9లోపు అప్లై..
LIC IPO: అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసేవారు దీర్ఘకాలిక ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి.

LIC IPO: గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ ఈ రోజే ప్రారంభమైంది. మే 9 వరకు అందుబాటులో ఉంటుంది. పబ్లిక్ ఇష్యూ ధర రూ.902 నుంచి 949గా ప్రకటించారు. అయితే పాలసీదార్లకు రూ.60లు, రిటైలర్లకు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కైంటు ఇస్తున్నారు.

అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసేవారు దీర్ఘకాలిక ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఇతర బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీ ఐపీఓ ధర సహేతుకంగానే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పబ్లిక్ ఇష్యూని విజయవంతం చేయడానికి ఎల్‌ఐసీ చర్యలు చేపట్టింది. మంగళవారం పాలసీదారులకు ఎస్ఎంఎస్ లు పంపింది. ఐపీఓకు సంబంధించిన వివరాలు..

సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించనుంది. భారత ఈక్విటీ మార్కెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఐపీఓ. ఒక్కో షేరు ధర రూ.902 నుంచి 949 గా ఉంది. అయితే ఒకరు కనీసంగా 15 షేర్లు కొనాల్సి ఉంటుంది. అంటే రూ.14,235 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు మే 16న బదిలీ అవుతాయి. మే 17న షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో నమోదు కానున్నాయి.

ఫిబ్రవరి 13న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. మార్చిలో అనుమతి లభించింది. ఈ ఐపీఓ ద్వారా సమకూరే నిధులన్నీ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. 2022-23లో మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎల్ఐసీకి 13 లక్షల మంది వ్యక్తిగత ఏజెంట్లు ఉన్నారు. 29 కోట్ల మంది పాలసీదారులకు సేవలందిస్తోంది. జనవరి 2022 నాటికి కొత్త బిజినెస్ ప్రీమియం వసూలులో ఈ సంస్థ మార్కెట్ వాటా 61.6 శాతం, 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం.. 2020 లో జీవిత బీమా కొనుగోలు 3.2 శాతం పెరిగింది. ఇది ప్రపంచ సగటుకు దాదాపు సమానం. ఈ రంగంలో 2019-023 మధ్య ఏటా 5.3 శాతం వృద్ధి నమోదు కానుందని అంచనా.

Tags

Read MoreRead Less
Next Story