LIC IPO: మే 4న ప్రారంభం కానున్న ఎల్‌ఐసి IPO.. గుర్తుంచుకోవాల్సిన అంశాలు

LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ)ని మే 4, బుధవారం ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇష్యూ మే 9, సోమవారంతో ముగుస్తుంది.
902-949 ప్రైస్ బ్యాండ్‌లో ప్రభుత్వం వాటాలను విక్రయిస్తుందని ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ తెలిపింది. కంపెనీలో 3.5 శాతం వాటా లేదా 22.13 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేసి రూ. 20,557.23 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
IPO షేర్లు ఎల్‌ఐసి ఉద్యోగులకు రూ.45 తగ్గింపు, పాలసీదారులకు రూ.60 తగ్గింపుకు లభిస్తాయి. ఎల్‌ఐసి IPOకు దరఖాస్తు చేసుకునేటప్పుడు గమనించాల్సిన ముఖ్యాంశాలు..
దరఖాస్తు దారులకు తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతా ఉండాలి. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు. కొత్తగా మరొకటి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు కొత్తతరం బ్రోకరేజీ సంస్థలు పూర్తిగా డిజిటల్ రూపంలోనే డీమ్యాట్ ఖాతాలను అందిస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన సంస్థ నుంచి డీమ్యాట్ ఖాతాను తెరవొచ్చు. కొన్ని గంటల్లోనే మీకు ఖాతా సిద్ధం అవుతుంది.
అయితే డీమ్యాట్ ఖాతా కోసం మీ దగ్గర పాన్, ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఖాతాను తీసుకునేందుకు వీలవుతుంది. ఆధార్ ఓటీపీ ద్వారా కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒకేవేళ ఇప్పటికే మీకు డీమ్యాట్ ఖాతా ఉంటే అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇ మెయిల్, ఫోన్ నెంబర్ వంటి వన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆన్‌లైన్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వంటివన్నీ పనిచేస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే కొత్త పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com