ఆ వడ్డీని మాఫీ చేయమని కేంద్రాన్ని ఆదేశించలేం : సుప్రీంకోర్టు

ఆ వడ్డీని మాఫీ చేయమని కేంద్రాన్ని ఆదేశించలేం : సుప్రీంకోర్టు
మారటోరియం కాలం పొడిగించమని కేంద్రానికి చెప్పేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.

మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయమని కేంద్రాన్ని ఆదేశించలేమని చెప్పింది సుప్రీంకోర్టు. ఆర్థిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని కూడా స్పష్టం చేసింది. అలాగే, మారటోరియం కాలం పొడిగించమని కేంద్రానికి చెప్పేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.

చక్రవడ్డీ మాఫీలో 2కోట్ల వరకు ఉన్న రుణాలకే పరిమితం చేయడం కరెక్టుగా లేదన్న అత్యున్నత న్యాయస్థానం.. రెండు కోట్ల కంటే ఎక్కువ ఉన్న రుణాలపై కూడా మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేయాలని ఆదేశించింది. ఆర్థిక, విధానపరమైన నిర్ణయాలపై న్యాయసమీక్ష సాధ్యం కాదని తేల్చి చెప్పింది.


Tags

Read MoreRead Less
Next Story