LOANS: పర్సనల్ లోన్ Vs గోల్డ్ లోన్.. ఏది బెటర్?

LOANS: పర్సనల్ లోన్ Vs గోల్డ్ లోన్.. ఏది బెటర్?
X
ఇటీవల కాలంలో లోన్స్ ఇస్తున్న బ్యాంకులు.. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్లు... సిబిల్ స్కోర్ ఆధారంగా పర్సనల్ లోన్

మనకు ఎప్పు­డు డబ్బు అత్య­వ­స­రం­గా కా­వా­ల్సి వస్తుం­దో ముం­దు­గా ఊహిం­చ­లేం. ఇక అవ­స­రం పడి­న­ప్పు­డు తీరా చే­తి­లో డబ్బు లే­కుం­డా ఎవ­రి­ని అడి­గి­నా ఇవ్వ­న­ప్పు­డు బ్యాం­కు­ల్లో లో­న్ల కోసం చూ­డొ­చ్చు. అయి­తే అవ­స­రం ఉన్న­ప్పు­డు రుణం తీ­సు­కో­వ­డం సు­ల­భం­గా అని­పిం­చొ­చ్చు. కానీ, అం­దు­బా­టు­లో ఉన్న ఎం­పి­కల ఆధా­రం­గా సరైన ని­ర్ణ­యం తీ­సు­కో­వ­డం చాలా ము­ఖ్యం. మా­ర్కె­ట్‌­లో లోన్ తీ­సు­కు­నేం­దు­కు చాలా ఆప్ష­న్లు అం­దు­బా­టు­లో ఉన్నా­యి. సరై­న­దా­న్ని ఎం­చు­కో­వ­డం కష్టం­గా­నే ఉం­టుం­ది. మీకు వే­గం­గా.. చి­న్న మొ­త్తం­లో డబ్బు అవ­స­ర­మై­తే పర్స­న­ల్ లోన్ లేదా గో­ల్డ్ లోన్ అనే రెం­డు ఎం­పి­కల గు­రిం­చి ముం­దు ఆలో­చిం­చా­లి. వడ్డీ రే­ట్లు, ప్రా­సె­సిం­గ్ రు­సు­ము­లు, ప్ర­క్రియ సమయం, తి­రి­గి చె­ల్లిం­చే ని­బం­ధ­న­లు వంటి అం­శాల ఆధా­రం­గా దే­ని­నై­నా ఎం­చు­కో­వ­చ్చు. ఇప్పు­డు ఈ రెం­డిం­టి మధ్య తే­డా­లేం­టో తె­లు­సు­కుం­దాం.

పర్సనల్ లోన్స్

పర్సనల్ లోన్ అనేది ఒక అన్‌సెక్యూర్డ్ లోన్. అంటే ఈ రుణం పొందడానికి మీరు మీ ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోరు, ఆదాయం, గతంలో రుణాలను తిరిగి చెల్లించిన చరిత్ర ఆధారంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఈ రుణాన్ని మంజూరు చేస్తాయి. ఈ రుణం ద్వారా పొందిన డబ్బును వైద్య ఖర్చుల నుంచి ఇంటి మరమ్మత్తుల వరకు, వివాహాల నుండి వ్యాపారాల వరకు దేనికైనా ఉపయోగించుకోవచ్చు.

రుణ మొత్తం: మీ ప్రొఫైల్‌ను బట్టి రూ.50,000 నుంచి రూ.50 లక్షల వరకు

తిరిగి చెల్లింపు వ్యవధి: 1 నుండి 8 సంవత్సరాలు

వడ్డీ రేటు: ఏడాదికి 10శాతం-24శాతం వరకు ఉంటుంది

అర్హత: మంచి సిబిల్ స్కోరు, స్థిరమైన ఆదాయం

ప్రయోజనాలు: ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. నిధుల వినియోగంలో స్వేచ్ఛ ఉంటుంది.

ప్రతికూలతలు: మంచి క్రెడిట్ స్కోరు లేకపోతే అధిక వడ్డీ, అర్హత ప్రమాణాలు కఠినంగా ఉంటాయి.

గోల్డ్ లోన్స్

బంగారు రుణం అనేది ఒక సెక్యూర్డ్ లోన్. దీనికి హామీగా మీరు మీ బంగారు ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టాలి. బంగారం ఉంటుంది కాబట్టి, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మీ క్రెడిట్ చరిత్రపై ఎక్కువ నిబంధనలు పెట్టరు. తక్కువ సమయంలో అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.

రుణ మొత్తం: బంగారం మార్కెట్ విలువలో 75శాతం వరకు

తిరిగి చెల్లింపు వ్యవధి: సాధారణంగా 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు

వడ్డీ రేటు: ఏడాదికి 8శాతం నుండి 29శాతం ఉంటుంది

అర్హత: 18 ఏళ్లు పైబడిన పౌరులు ఎవరైనా అర్హులు

ప్రయోజనాలు: తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ సమయంలో డబ్బు చేతికి వస్తుంది. క్రెడిట్ స్కోరు అంతగా ప్రభావితం చేయదు.

ప్రతికూలతలు: మీరు రుణాన్ని తిరిగి చెల్లించకపోతే మీ బంగారం కోల్పోయే ప్రమాదం ఉంది.

ఏది బెస్ట్..?

పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ వాటి స్వంత ప్రయోజనాలు, రిస్క్‌లతో ఉంటాయి. మీకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉండి.. క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుతో స్వల్పకాలిక రుణం కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Tags

Next Story