London Tea Exchange: ఆ టీ పొడి ఖరీదు కేజీ రూ.13 కోట్లు.. ఫ్రాంచైజీకే రూ.కోటిన్నర!

London Tea Exchange: ఆ టీ పొడి ఖరీదు కేజీ రూ.13 కోట్లు.. ఫ్రాంచైజీకే రూ.కోటిన్నర!
London Tea Exchange: ఎల్‌టీఈ ఫ్రాంఛైజీ దక్కించుకోవాంటే లొకేషన్ చాలా బాగుండాలని, రూ. కోటిన్నర కట్టాల్సి ఉంటుందట.

London Tea Exchange: టీ అనేది రోజూవారి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇప్పటికీ చాలామంది టీ తీసుకోకుండా రోజును ప్రారంభించరు. అయితే టీలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని టీ పొడుల ధర చూస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే. అలాంటి వాటిలో ఒకటే లండన్ టీ ఎక్స్‌ఛేంజ్ (ఎల్‌టీఈ). ఇప్పటివరకు ఫారిన్‌లోనే అందుబాటులో ఉన్న ఈ టీ.. త్వరలో ఇండియాకు కూడా రానుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ హౌజ్‌గా ఎల్‌టీఈ గుర్తింపు సాధించింది. 1552లో ఈ టీ ఎక్స్‌ఛేంజ్ ప్రారంభమయ్యింది. బ్రిటీష్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ పెళ్లి సందర్భంగా దీనిని ప్రారంభించారు. అందుకేనేమో దీనిని ఎక్కువగా సంపన్నులే ఉపయోగిస్తారు. ప్రారంభమయిన దగ్గర నుండి ఇప్పటివరకు ఎల్‌టీఈకు 500 మంది యజమానులు మారారు.

ప్రస్తుతం ఎల్‌టీఈ ఇండియాలో తన మొదటి బ్రాంచ్‌ను ప్రారంభించడానికి చోటును వెతికే పనిలో పడ్డారు. ఇండియాలోనే బిజీ ప్రదేశాల్లో ఒకటైన ఢిల్లీ లేదా బెంగుళూరులో దీని బ్రాంచ్ ప్రారంభం కానుంది. అయితే ప్రారంభానికి ముందే ఎల్‌టీఈ ఓ టార్గెట్ పెట్టుకుంది. నాలుగేళ్లలో 200 స్టోర్లు, మొదటి ఏడాదిలోనే 50 స్టోర్లను ప్రారంభించాలని ఎల్‌టీఈ అనుకుంటోంది.

ఎల్‌టీఈ ఫ్రాంఛైజీలను కూడా ఆహ్వానిస్తోంది. కానీ ఎల్‌టీఈ ఫ్రాంఛైజీ దక్కించుకోవాంటే లొకేషన్ చాలా బాగుండాలని, అంతే కాకుండా రూ. కోటిన్నర కట్టాల్సి ఉంటుందని యజమానులు అంటున్నారు. అయితే ఎల్‌టీఈ ద్వారా అందుబాటులోకి వచ్చే ఒక్క టీ ధర ఏకంగా రూ. 120 ఉంటుందట. ఇందులోనే ప్రత్యేకమైన టీ పొడి ధర కిలోకు రూ. 13 కోట్లు ఉంటుందట.

Tags

Read MoreRead Less
Next Story