Real Estate: రూ.25,000 జీతంతోనూ సొంత ఇల్లు కొనుక్కోవచ్చు! ఎలా అంటే..

Real Estate: రూ.25,000 జీతంతోనూ సొంత ఇల్లు కొనుక్కోవచ్చు! ఎలా అంటే..
Real Estate: ఇల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి కల. ఎంత ఎక్కువ సంపాదన ఉంటే.. అంత విలాసవంతమైన ఇళ్లు.

Real Estate: ఇల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి కల. ఎంత ఎక్కువ సంపాదన ఉంటే.. అంత విలాసవంతమైన ఇళ్లు. ఒకవేళ తక్కువ సంపాదన ఉంటే దానికి తగినట్టు ఒక చిన్న ఇల్లు. ఏదేమైనా ఒక సొంత ఇల్లు ఇచ్చే సంతృప్తి వేరేలా ఉంటుంది. ముఖ్యంగా ఒక ఇల్లు కొనాలంటే మనం ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాం? ఆ విషయం తెలుసుకోవడానికే ఒక సర్వే జరిగింది. ఇలా రియల్ ఎస్టేట్( Real Estate) సర్వేలు జరగడం కొత్తేమీ కాదు. ప్రతీ ఏడాది ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ గతేడాది కంటే ఈ సంవత్సరం సర్వేలో ఎక్కువమంది పాల్గొని వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

రూ. 90 లక్షలు నుండి రూ. 2.5 కోట్ల మధ్య ఇళ్లను కొనుగోలు చేయడానికి అత్యధిక శాతం మంది ఇష్టపడుతున్నారని ఈ సర్వేలో తేలింది. కొత్తగా మొదలైన ప్రాజెక్టులలో ఇళ్లను కొనుగోలు చేయడం కంటే అప్పటికే పూర్తయిన ఇళ్లను కొనుగోలు చేయడానికే 80 శాతం మంది ప్రజలు ఇష్టపడుతున్నారు. రూ. 45 నుండి 90 లక్షల మధ్య ఉండే ఇళ్లను కొనుగోళు చేస్తామని 35 శాతం మంది ఓట్లు వేశారు. అంతకంటే తక్కువ ధరల వైపు 25 శాతంమంది మొగ్గుచూపుతున్నారు.

ఇళ్ల నిర్మాణాన్ని ఒకప్పటి లాగా దగ్గర ఉండి పరిశీలించలేకపోతున్నారు యజమానులు. అందుకే వారి స్థానంలో డెవలపర్లను నియమిస్తున్నారు. ఆ డెవలపర్ అపరిచత వ్యక్తి కాకుండా తెలిసిన వారు, నమ్మినవారు అయితే బాగుంటుందని 77 శాతం మంది భావిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలో ప్రతీ ఒక్కటి మనకు ఆన్‌లైన్‌లోనే లభిస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లో ఇళ్ల అమ్మకాలు కూడా చాలానే పెరిగాయి. ప్రస్తుతం 60 శాతం మంది ఆన్‌లైన్‌లో రియల్ ఎస్టేట్‌(Real Estate) బిజినెస్‌ను నమ్ముతున్నారు.

ఒక ఇల్లు కొనడమే గగనం అనుకుంటుంటే వ్యక్తిగత అవసరాల కోసం రెండో ఇల్లు కొనుగోలు చేయడానికి 41 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల్లో బాగా డబ్బులు సంపాదించి భారతదేశంలో రియల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నవారు ఎక్కువగా బెంగళూరు, ముంబాయి, చెన్నైలో ఇళ్ల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. పైగా హోమ్ లోన్స్‌పై తగ్గుతున్న వడ్డీ రేట్లు కూడా చాలామందికి సొంత ఇంటి కలను నెరవేరుస్తుంది. 25 వేల రూపాయలు జీతమొచ్చినా ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాదు.

Tags

Read MoreRead Less
Next Story