Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో తక్కువ వడ్డీ రేట్లు.. అధిక రాబడి కోసం..

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో తక్కువ వడ్డీ రేట్లు.. అధిక రాబడి కోసం..
Fixed Deposits: వడ్డీపైన ఆధారపడే సీనియర్ సిటిజన్లకు ఇది ఇబ్బందికర పరిణామమే. ఖర్చులు పెరుగుతూ ఆదాయం తగ్గితే అది వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.

Fixed Deposits: అవసరానికి ఆదుకుంటాయి.. ఆర్థిక అవసరాలు చెప్పి రావు అని తక్షణ అవసరాల కోసం డిపాజిట్లు చేయడం పరిపాటి.. కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తే జీవితానికి తగినంత భరోసా ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తారు.. అయితే భద్రతకు భయం లేకపోయినా వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఒకటి రెండేళ్ల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేటు వస్తోంది. పన్ను మినహాయింపు పోను చేతికి వచ్చేది చాలా తక్కువగా ఉంటోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్‌డీ (FD)లు పెట్టుబడికి ఏమాత్రం తోడ్పడవనే చెప్పాలి. వడ్డీపైన ఆధారపడే సీనియర్ సిటిజన్లకు ఇది ఇబ్బందికర పరిణామమే. ఖర్చులు పెరుగుతూ ఆదాయం తగ్గితే అది వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది.

అయితే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో అయిదేళ్ల వ్యవధికి మించిన వడ్డీ రేట్లు 4.9 %-5.50% వరకు ఉన్నాయి. ఉదాహరణకు కెనరా బ్యాంక్ 5,10 ఏళ్ల కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 5.50శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ అందిస్తోంది. అదే పోస్టాఫీసుల్లో అయితే అయిదేళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 6.7 శాతం వడ్డీ అందిస్తోంది.

కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో కూడా 5ఏళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.5 శాతం వడ్డీ అందిస్తున్నాయి. అయితే అధిక వడ్డీ రేటు కోసం దీర్ఘకాలిక డిపాజిట్లు చేస్తుంటారు. కానీ దానికంటే స్వల్ప వ్యవధి డిపాజిట్లనే ఎంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. వడ్డీ రేట్లు పెరిగిన తరువాత దీర్ఘకాలిక డిపాజిట్లుగా మార్చుకోమని సలహా ఇస్తున్నారు.

కస్టమర్లను ఆకర్షించేందుకు చిన్న చిన్న బ్యాంకులు ఎఫ్‌డీ (FD)లపై అధిక వడ్డీ రేట్ల ఆశ చూపుతాయి. కానీ వాటిని ఎంచుకునే సమయంలో జాగ్రత్త అవసరం. బ్యాంకుల్లో రూ.5 లక్షల లోపు డిపాజిట్లకు డిపాజిటరీ ఇన్సూరెన్స్ లభిస్తుంది.

వడ్డీ ఆదాయంపైనే ఆధారపడిన వారు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల కోసం చూస్తున్న వారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కన్నా ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు, కార్పొరేట్ బాండ్లు వంటి స్థిరాస్థులను ఎంచుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు బిజినెస్ ఎనలిస్టులు.

Tags

Read MoreRead Less
Next Story