మహీంద్రా నుంచి బోలేరో నియో వాహనం సరికొత్త ఫీచర్లతో..!

ప్రముఖ వాహన సంస్థ మహీంద్రా నుంచి బోలేరో నియో వాహనం సరికొత్త ఫీచర్లతో ముస్తాబై మార్కెట్లోకి వచ్చింది. ఎక్స్ షోరూమ్‌లో ఈ వాహనం ప్రారంభ ధర రూ.8.48 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ఇది నాలుగు వేరియంట్లలో వాహన ప్రియులను అలరిస్తోంది.
ఈ నాలుగు వేరియంట్ల ధరలను వరుసగా చూస్తే..
బోలెరో ఎన్ 4 వేరియంట్ ధర రూ. 8.48 లక్షలు
బోలెరో ఎన్ 8 వేరియంట్ ధర రూ. 9.48 లక్షలు
బోలెరో ఎన్ 10 వేరియంట్ ధర రూ. 9.99 లక్షలు
బోలెరో ఎన్ 10(ఓ) వేరియంట్ ధర ఇంకా ప్రకటించలేదు. ఇక కలర్స్ వచ్చి సిల్వర్, నాపోలీ బ్లాక్, హైవే రెడ్, రాకీ బీజ్ పెరల్ వైట్ రంగుల్లో లభ్యమవుతుంది. సరికొత్త హెడ్ ల్యాంపులతో కూడిన ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు..
15 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, ఆల్ అరౌండ్ బాడీ క్లాడింగ్, సరికొత్త ఫాగ్ ల్యాంపులు, సిక్స్ వర్టికల్ స్లాట్ గ్రిల్, రెండు వైపులా ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, సైడ్ అండ్ రియర్ ఫుట్ స్టెప్పులు.
ఫీచర్లు..
7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, 3.5 అంగుళాల ఎంఐడీ డిస్ ప్లే, అనలాగ్ డయల్స్, ఫ్రంట్ ఆర్మెరెస్ట్స్ ఫర్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్, బ్లూటూత్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, 6 స్పీకలర్ ఆడియో సిస్టం. ఈ సరికొత్త బోలెరో వాహనంలో 7 సీటింగ్ కాన్పిగరేషన్‌తో అందుబాటులోకి వచ్చింది. 5-సీపట్ ఫస్ట్, రెండో వరుసతో వచ్చింది. బూట్ స్పేస్ వచ్చి 348 లీటర్లు ఉంది.
ఇంజిన్..
ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ 1.5 లీటర్ డీజిల్ ఎంహాక్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 3750 ఆర్పీఎం వద్ద 100 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 2250 ఆర్పీఎం వద్ద 260 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది.
సేప్టీ ఫీచర్లు..
హై స్టెంథీ స్టీల్ బాడీ షెల్
డ్రైవర్, కో డ్రైవర్ కు డ్యూయల్ ఎయిర్ బ్యాగులు
ఏబీఎస్‌తో కూడిన ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ ఈబీడీ
ఆటోమేటిక్ డోర్ లాక్స్
హైస్పీడ్ అలెర్ట్ వార్నింగులు
భారత మార్కెట్లో ఈ సరికొత్త మహీంద్రా బోలెరో నియో ఎస్ యూవీకి పోటీగా మహీంద్రా ఎక్స్ యూవీ 300, హ్యూండాయ్ వెన్యూ, మారుతీ సుజుకీ విటారా బ్రెజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ లాంటి కాంపాక్ట్ ఎస్ యూవీ కార్లు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com