Mahindra : మహీంద్రా XEV 9S రహస్యాలు రివీల్.. లాంచ్ కంటే ముందే తెలిసిపోయిన 8 హైటెక్ ఫీచర్స్ ఇవే.

Mahindra : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి త్వరలో రాబోతున్న కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా XEV 9S గురించి లాంచ్‌కు ముందే పెద్ద సీక్రెట్ బయటకు వచ్చింది. ఈ కొత్త ఫ్యామిలీ ఎస్‌యూవీ నవంబర్ 27, 2025న అధికారికంగా విడుదల కానుంది. రోజురోజుకూ టీజర్ ఇమేజ్‌లు, వీడియోల ద్వారా కంపెనీ కొత్త సమాచారాన్ని వెల్లడిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో ఈ కారులో ఉండబోయే 8 హైటెక్ ఫీచర్లను మహీంద్రా ధృవీకరించింది. అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లతో రాబోతున్న ఈ కారు వివరాలు కింద చూద్దాం.
మహీంద్రా అధికారిక టీజర్‌ల ద్వారా XEV 9S కారులో కింది అత్యాధునిక ఫీచర్లు ఖచ్చితంగా ఉంటాయని ప్రకటించింది.
* ట్రిపుల్ స్క్రీన్ సెటప్: XEV 9e మాదిరిగానే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో డ్రైవర్ కోసం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ * * * ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు ప్రయాణీకుడి కోసం ప్రత్యేక వినోద డిస్‌ప్లే తో కూడిన మూడు స్క్రీన్‌లు ఉంటాయి.
* బ్యాక్‌లిట్ లోగోతో స్టీరింగ్: మెరిసే నలుపు రంగులో ఉండే స్టీరింగ్ వీల్‌పై ప్రకాశించే లోగో.
* హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్: అద్భుతమైన ఆడియో అనుభవం కోసం హర్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్.
* పవర్ విండో స్విచ్‌లు: XEV 9e మరియు BE 6 లో ఉన్నట్లుగా టాగుల్ లాంటి పవర్ విండో స్విచ్‌లు.
* మెమరీ ఫంక్షన్‌తో డ్రైవర్ సీటు: పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఇది సెట్టింగ్‌లను గుర్తుంచుకోగల మెమరీ ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది.
* స్లైడింగ్ సెకండ్ రో సీట్లు: అవసరాన్ని బట్టి ముందు-వెనుకకు జరుపుకునే రెండవ వరుస సీట్లు.
* పనోరమిక్ సన్‌రూఫ్: కారు లోపల మరింత కాంతి, విశాలమైన అనుభూతిని అందించే పనోరమిక్ సన్‌రూఫ్.
* ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్: ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.
మహీంద్రా XEV 9S అధికారిక స్పెసిఫికేషన్‌లు ఇంకా వెల్లడి కానప్పటికీ ఈ 7-సీటర్ ఎస్‌యూవీలో XEV 9e లో ఉపయోగించిన 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. సింగిల్ మోటార్ కాన్ఫిగరేషన్‌లో ఈ బ్యాటరీలు MIDC టెస్టింగ్ ప్రకారం సుమారు 542 కి.మీ (59kWh), 656 కి.మీ (79kWh) వరకు రేంజ్‌ను అందించగలవు. ఈ 7-సీటర్ XEV 9S కూడా దాని 5-సీటర్ వెర్షన్ మాదిరిగానే రేంజ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
కన్ఫాం చేసిన ఫీచర్లతో పాటు రాబోయే XEV 9Sలో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్, మసాజింగ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది:
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

