Stock Market Investment: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ 5 సక్సెస్ సీక్రెట్లు మీకోసమే..

Stock Market Investment: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ 5 సక్సెస్ సీక్రెట్లు మీకోసమే..
బ్యాంకుల్లో డిపాజిట్లు.. ఇతర సేవింగ్ మార్గాల కంటే బెస్ట్ రిటర్న్ స్టాక్ మార్కెట్.

Stock Market Investment: స్టాక్ మార్కెట్ సంపద రెట్టింపు చేయడానికి దోహదపడుతుందన్నది నిజం. బ్యాంకుల్లో డిపాజిట్లు.. ఇతర సేవింగ్ మార్గాల కంటే బెస్ట్ రిటర్న్ మరియు...ఆర్ధిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేందుకు మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్. ఇందులో మరోమాట లేదు. ఇందులో కూడా ఒక్కోసారి నష్టాలు రావడం సహజం..అయితే మార్కెట్ స్టాటజీని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. అక్షయపాత్ర తరహాలో మీ పెట్టుబడులను పెంచుతూనే ఉంటుంది స్టాక్ మార్కెట్. అయితే కేపిటల్ పెట్టడం మాత్రమే మీ సక్సెస్ కు దారి చూపదు. దీనికి కొన్ని పద్దతుంటాయి.. మరికొన్ని నియమాలూ ఉన్నాయి. క్రమశిక్షణా పద్దతులు అవలంబించాలి. అవగాహన కల్పించుకోవాలి. మార్కెట్లో సక్సెస్ కు నిర్ధిష్ట వ్యూహం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యేందుకు నిపుణులు ఇస్తున్న 5 టిప్స్ ఇప్పుడు చూద్దాం..

1. వాస్తవిక అంచనాలు అవసరం

ఇది వినడానికి వింతగా అనిపించకపోవచ్చు కాని చాలా ముఖ్యమైనది. మీకు మీరుగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని తెలుసుకోండి. ఎవరి ఒత్తిడులకు తలొగ్గి ఇందులోకి రావద్దు. తప్పుడు అంచనాలతో ఎంట్రీ ఇవ్వొద్దు. రాత్రికి రాత్రి 100 శాతం ఆదాయం అంటే రెట్టింపు లాభాలు వస్తాయన్న అంచనాలు సరికాదు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. స్టాక్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించడానికి సహనం అవసరం. అత్యుత్సాహంతో నష్టాల భారీన పడకుండా.. బలమైన మరియు స్థిరమైన విధానాన్ని అనుసరించండి. సింపుల్ లాజిక్ మినిమం నెలకు 1శాతం ప్రాఫిట్ అనుకోండి. ఏడాదికి 12శాతం వస్తుంది. తక్కువలో తక్కువ ఇది.

2. బ్యాక్‌ టెస్ట్ స్ట్రాటజీలను ఉపయోగించండి

ఇది ఆటోమేటెడ్ ట్రేడింగ్‌కు వర్తిస్తుంది, ఇది స్టాక్‌లను ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ వే. కొత్తగా వచ్చే ఔత్సాహికులకు ఇది ఉత్తమం. మార్కెట్ ప్రాఫిట్ పొందడానికి అల్గోరిథమ్స్ మీకు సాయపడతాయి. పాత డేటాపై అభివృద్ధి చెందిన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా బ్యాక్‌టెస్టింగ్ జరుగుతుంది.

3. భావోద్వేగాలను నియంత్రించండి

మీరు మార్కెట్ నుండి డబ్బు సంపాదించాలనుకుంటే మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మార్కెట్లో ఉండే అనిశ్చితి పరిస్థితుల్లో మరియు అధికంగా లాభాలు వస్తున్న సమయంలో ఇన్వెస్టర్లు దురాశతో ప్రవర్తిస్తారు. ఈ రెండూ సమయాల్లో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది.

4. పోస్ట్ ట్రేడ్ అనాల్ సిస్

మార్కెట్లో మీకు లాభాలు వచ్చినా, నష్టాలు తీసుకొచ్చినా దీనిపై విశ్లేషణ అవసరం. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలున్నాయి. లాభం రావడానికి కారణాలు తెలుసుకుంటే భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు తెలుస్తాయి. నష్టాలకు కారణాలు గుర్తిస్తే మళ్లీ తప్పులు చేయకుండా దోహదపడుతాయి.

5. పరిజ్ఞానాన్ని పెంచుకోవడం

మీకున్న అవగాహన, డే టు డే అప్ డేట్ తెలుసుకోవడంలోనే మీ సక్సెస్ దాగుంది. నిత్యం ఏదోఒకటి నేర్చుకోవాలన్న తపన ఉండాలి. మార్కెట్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇన్వెస్టర్లు కూడా నిత్యం లెర్నింగ్ మా సక్సెస్ కు కారణం అంటారు. వాళ్లు నిరంతరం కొత్తగా శోధిస్తూనే ఉంటారు. ఏ కంపెనీల్లో ఏం జరుగుతుంది. భవిష్యత్తులో డిమాండ్ దేనికి ఉంటుంది. ప్రభుత్వ విధానాలేంటి? వంటి అంశాలపై అవగాహన మిమ్మల్ని బెస్ట్ ఇన్వెస్టర్ ను చేస్తుంది.

మీరు మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు ఈ 5 సూత్రాలను కచ్చితంగా అనుసరించాలి. అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది. స్టాక్ మార్కెట్లో లాభాలు పొందుతారు. హ్యాపీ ట్రేడింగ్.. బెస్ట్ ఆఫ్ లక్.

Tags

Read MoreRead Less
Next Story