AutoMobile: మార్కెట్లోకి మారుతీ నూతన కారు 'ఇన్విక్టో' విడుదల

AutoMobile: మార్కెట్లోకి మారుతీ నూతన కారు ఇన్విక్టో విడుదల
జీటా ప్లస్ (7-సీటర్) – రూ. 24.79 లక్షలు జీటా ప్లస్ (8-సీటర్) – రూ. 24.84 లక్షలు ఆల్ఫా ప్లస్ (7-సీటర్) – రూ. 28.42 లక్షలు

మారుతీ సుజుకీ సంస్థ మార్కెట్లోకి తన ఫ్లాగ్‌షిప్‌ విభాగంలో ఇన్విక్టో(Invicto) అనే మల్టీ పర్పస్ వెహికల్(MPV) కారును ఆవిష్కరించింది. స్టైలిష్ డిజైన్లతో కారు లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం ఆటోమేటిక్, హైబ్రిడ్ వర్షన్లలో దీనిని విడుదల చేశారు. ఈ కారు జీటా+, ఆల్ఫా+ అనే రెండు వేరియంట్లలో 4 కలర్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎక్స్ షోరూం ధర 24.70లక్షల నుంచి 28.42లక్షల్లో లభించనుంది. నెక్సా డీలర్‌షిప్‌లలో లభించనునున్న 8వ కారు ఇది.

MPV సెగ్మెంట్‌లో మరో దిగ్గజ కార్ల సంస్థ టయోటా ఇన్నోవా హైక్రాస్‌తో మార్కెట్‌లో పోటీ పడనుంది. ఈ విభాగంలో, ఇదే ధరల్లో ఉన్న మహీంద్ర SUV700, స్కార్పియో N, హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టార్లతో, టాటా సఫారీ వంటి మోడళ్లకు ధీటుగా దీనిని విడుదల చేశారు.




ఎక్స్‌టీరియర్..

ఈ కారును టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ని బేస్ చేసుకుని తయారుచేశారు. హైక్రాస్‌ని ఉత్పత్తి చేసే బిడాది ప్లాంట్‌లోనే ఇన్విక్టోని తయారుచేశారు. అందుకే బయట నుంచి చూడ్డానికి లుక్స్ కూడా కొద్దిగా హైక్రాస్‌లాగా అన్పించవచ్చు. సెలెస్టియల్ బ్లూ, మిస్టిక్ వైట్, మెజిస్టిక్ సిల్వర్, స్టెల్లార్ బ్రాంజ్ కలర్లలో లభించనుంది.

కొలతలు

కారు కొలతల విషయంలో కూడా ఈ రెండు కార్లు ఒకేలా ఉన్నాయి. పొడువు 4,755mm పొడువు, 1850mm వెడల్పు, 1795mm ఎత్తుతో రూపొందింది. 2850mmల వీల్‌ బేస్‌తో గతుకుల రోడ్లపై ఎలాంటి భయం లేకుండా ప్రయాణించవచ్చు.

ఇంజిన్

2.0 లీటర్లు, 4 సిలిండర్ల ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌కి అనుసంధానించారు. 0 నుంచి 100 కిమీ వేగాన్ని కేవలం 9.5 సెకండ్లలో అందుకోగలదు. మైలేజీ లీటర్‌కి 24.3కిమీ ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇన్విక్టో 17 ఇంచ్‌ల అల్లాయ్ వీల్స్‌తో రానుంది.

ఇంటీరియర్..


ఇన్విక్టో లోపల భాగంలో ఇంటీరియర్ నలుపు, బ్రౌన్ కలర్లలో సిల్వర్ టోన్‌, గోల్డ్‌ టోన్‌తో ఆల్ బ్లాక్ కలర్‌ ఆప్షన్లు ఉన్నాయి. 7 మరియు 8 సీటింగ్ వంటి సీటింగ్ ఆప్షన్లతో వస్తోంది. 239 లీటర్ల బూట్ స్పేస్ వినియోగదారులకు లభించనుంది. అయితే వెనక సీట్లను మడవడం ద్వారా 690 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

ఇన్ఫోటైన్‌మెంట్ & సేఫ్టీ, ఇతర ఫీచర్లు..

ఇన్విక్టోలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో పనిచేసే 10.1 ఇంచ్‌ల టచ్‌స్క్రీన్‌ని అమర్చారు. 7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్లర్, 360 కోణంలో పనిచేసే కెమెరా, సన్‌ రూఫ్ అదనపు ఆకర్షణలు. భద్రతాపరంగా 6 ఎయిర్ బ్యాగ్‌లు, సెన్సార్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టం, హిల్ స్టార్ట్ అసిస్ట్‌లను అందించనున్నారు.

వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్‌డ్ టెయిల్గేట్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story