Maruti Suzuki XL6: మారుతి సుజుకి NEXA XL6.. ఫీచర్లు, ధర చూస్తే..

Maruti Suzuki XL6: మారుతి సుజుకి NEXA XL6.. ఫీచర్లు, ధర చూస్తే..
Maruti Suzuki XL6: సరికొత్త మారుతి XL6 2022 వెంటిలేటెడ్ ఫ్రంట్ డ్రైవర్‌తో కూడిన కంపెనీ యొక్క మొదటి కారు.

Maruti Suzuki XL6: కొత్త 2022 మారుతి సుజుకి XL6 ఫేస్‌లిఫ్ట్ MPV భారతదేశంలో ఈరోజు, అంటే ఏప్రిల్ 21, 2022న ప్రారంభించబడింది. భారతదేశపు అతిపెద్ద కార్‌మేకర్ కొత్త మారుతి XL6 కొత్త ఇంజన్-ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌తో పాటు కొన్ని కాస్మెటిక్ డిజైన్‌లు మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో సిద్ధంగా ఉంది. కొత్త Nexa మారుతి సుజుకి XL6ని లాంచ్ చేస్తూ, మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ "ఇంటీరియర్స్ అన్నీ సౌలభ్యంగా ఉన్నాయని అన్నారు".

MPV కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు క్రోమ్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన రివైజ్డ్ హెడ్‌ల్యాంప్‌లను అమర్చారు. అదనంగా, ఇది కొత్త బ్లాక్-ఫినిష్డ్ ఫాగ్ ల్యాంప్స్ మరియు బాడీ-కలర్ ORVMలను కూడా కలిగి ఉంది. ఈ కొత్త 2022 మారుతి సుజుకి XL6 ఫేస్‌లిఫ్ట్ MPV కోసం ప్రీ-లాంచ్ బుకింగ్‌లు ఈ నెల ప్రారంభంలో ప్రారంభమయ్యాయి, బుకింగ్ కాస్ట్ రూ. 11,000గా నిర్ణయించబడింది. కొత్త మారుతి XL6 కియా కేరెన్స్, మహీంద్రా మరాజో, మారుతి ఎర్టిగాలకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

లాంచ్ ఈవెంట్ సందర్భంగా, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ హిసాషి టేకుచి మాట్లాడుతూ, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో అగ్రగామిగా ఎదగడం పైనే తమ దృష్టి అని అన్నారు.

2022 మారుతి XL6 ఫీచర్లు

సరికొత్త మారుతి XL6 2022 అనేది వెంటిలేటెడ్ ఫ్రంట్ డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ సీట్లతో కూడిన కంపెనీ యొక్క మొదటి కారు.

వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు 360-డిగ్రీ వ్యూ కెమెరా సౌలభ్యాన్ని అందిస్తుంది.

మారుతి XL6 ఫేస్‌లిఫ్ట్ నావిగేషన్, స్పీడ్, ఇంజన్ RPM మరియు గ్లాస్ స్క్రీన్‌పై చిహ్నాలు వంటి వివరాలను ప్రదర్శించే హెడ్స్-అప్ డిస్ ప్లేను పొందుతుంది.

ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, TPMS, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన కొత్త 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మరియు అంతర్నిర్మిత సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్‌ను కూడా జత చేశారు.

భద్రతను దృష్టిలో ఉంచుకుని, 2022 మారుతీ XL6 డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, సెన్సార్‌లతో వెనుక పార్కింగ్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్‌ల వంటి భద్రతా లక్షణాలను ఏర్పాటు చేశారు.

మారుతి XL6 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. మారుతి సుజుకి XL6 వివిధ ట్రిమ్ స్థాయిలలో లభిస్తుంది - Zeta, Alpha మరియు Alpha Plus. కొత్త మారుతి XL6 కొత్త అట్కిన్సన్ K15C డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది.

మారుతి XL6 ధర

మారుతి సుజుకి XL6 ధర ప్రస్తుతం రూ. 10.14 లక్షల నుండి రూ. 12.02 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ ధర). అనేక అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్‌ల చేరికతో రాబోయే XL6 ప్రస్తుత ధరల కంటే కొంచెం అధికంగా ఉండవచ్చు.

మారుతి XL6 వివిధ రంగులలో

మారుతి సుజుకి XL6 ఆరు రంగులలో లభిస్తుంది - సెలెస్టియల్ బ్లూ, బ్రేవ్ ఖాకీ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, ఓపులెంట్ రెడ్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్.

Tags

Read MoreRead Less
Next Story