Matchbox Price: అగ్గిపెట్టెలో ఇకపై 36 పుల్లలు కాకుండా ఎన్ని ఇస్తారంటే..

Matchbox Price (tv5news.in)
Matchbox Price: రోజురోజుకీ మనం ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ వాటన్నికంటే ఎక్కువ చర్చ అగ్గిపెట్టె ధర పెరిగినప్పుడే నడిచింది. సాధారణంగా అగ్గిపెట్టె ధరల్లో అంత సులువుగా మార్పు రాదు. చివరిసారిగా 14 ఏళ్ల క్రితం అగ్గిపెట్టె ధర రూ. 50 పైసలు నుండి రూ. 1కి చేరింది. తాజాగా అది రూ.2కు పెరిగింది. అయితే ధరతో పాటు అందులో అగ్గిపుల్లల సంఖ్య కూడా పెరగనుందట.
ఇప్పటివరకు ఒక చిన్న అగ్గిపెట్టెలో 36 పుల్లలు వచ్చేవి. ఇప్పటి నుండి అందులో 50 పుల్లలు వస్తాయని మ్యాచ్‌బాక్స్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. పెరిగిన ధరలు డిసెంబర్ 1 నుండి అమలు కానున్నాయి.
అగ్గిపెట్టె అనేది మన రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడే వస్తువు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో లైటర్‌కు బదులుగా అగ్గిపెట్టెనే ఉపయోగిస్తారు. అలాంటి అగ్గిపెట్టె ధరలు కూడా ఇప్పుడు పెరగనున్నాయి. ఇదేమీ పెద్దగా ఆశ్చర్యపోయే విషయం కాకపోవచ్చు. కానీ.. బిజినెస్ భాషలో చెప్పాలంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com