Matchbox Price: అగ్గిపెట్టె రేటు కూడా భగ్గుమంటుంది.. దాదాపు 14 ఏళ్ల తర్వాత..

Matchbox Price (tv5news.in)
Matchbox Price: మన ఇంట్లో ఉండే ఏ నిత్యావసర సరుకులు అయినా.. రోజురోజుకీ రేటు మారుతూనే ఉంటాయి. పైగా ఈరోజుల్లో ఉన్న ధరలకు మిడిల్ క్లాస్ పైన మరింత ఆర్థిక భారం పడుతోంది. కానీ 14 ఏళ్లుగా మారని ఒక నిత్యావసర వస్తువు ధర ఇప్పుడు మారింది. అది లేకుండా మనకు రోజు గడవకపోయినా.. దాని రేటును పెంచి మిడిల్ క్లాస్‌పై మరింత భారం పెంచడం ఎందుకు అనుకున్నారో ఏమో యాజమాన్యం.. ఇన్నేళ్లు దాని ధర చెక్కుచెదరకుండా ఉంది.
అగ్గిపెట్టె అనేది మన రోజువారీ జీవితంలో చాలా ఉపయోగపడే వస్తువు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో లైటర్‌కు బదులుగా అగ్గిపెట్టెనే ఉపయోగిస్తారు. అలాంటి అగ్గిపెట్టె ధరలు కూడా ఇప్పుడు పెరగనున్నాయి. ఇదేమీ పెద్దగా ఆశ్చర్యపోయే విషయం కాకపోవచ్చు. కానీ.. బిజినెస్ భాషలో చెప్పాలంటే ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ.
మిగతా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో అగ్గిపెట్టె తయారీ కంపెనీలు కూడా వీటి ధరను పెంచడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఉన్న ధరకు డబుల్ కానుంది అగ్గిపెట్టె రేటు. చివరిసారిగా అగ్గిపెట్టె ధరలో మార్పులు వచ్చింది 2007లో. అప్పటివరకు దాని ధర రూ.50 పైసలు ఉండగా అదికాస్త రూ.1 అయ్యింది. ఇప్పుడు అది రూ.1 నుండి రూ.2కు చేరింది.
అగ్గిపెట్టె ఇండస్ట్రీ చాలామందికి ఉపాధి కలిగిస్తోంది. ధరలు అలాగే ఉన్నా మెటీరియల్స్ ఖర్చు ఎక్కువవడంతో అగ్గిపెట్టె ఇండస్ట్రీ లాభాలను రాబట్టలేకపోతోంది. దీంతోపాటు అధిక వేతనాలు ఇస్తున్న ఇతర ఉద్యోగాలపై వర్కర్లు మొగ్గుచూపుతున్నారు అంటోంది నేషనల్ స్మాల్ మ్యాచ్‌బాక్స్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్.
అగ్గిపెట్టె ధరల్లో వచ్చిన మార్పులు..
రెడ్ పాస్ఫరస్ ధర రూ. 425 నుండి రూ. 810కు పెరిగింది.
కేజీ వ్యాక్స్ ధర రూ. 58 నుండి రూ. 80 చేరుకుంది.
ప్రస్తుతం 600 అగ్గిపెట్టెలు ఉన్న బాక్స్ రూ. 270 నుండి రూ. 300 మధ్యలో అమ్ముడవుతోంది. ఇది రూ. 430 నుండి రూ. 480 మధ్య పెరిగింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com