Mercedes-Benz 300 SLR: కారు ధర రూ. 1,108 కోట్లు.. స్పెషాలిటీ ఏంటంటే..?

Mercedes-Benz 300 SLR: కార్ల విషయంలో కొంతమంది చాలా ఆసక్తిగా ఉంటారు. కొత్త రకమైన కార్లు కొనుగోలు చేయాలని.. భారతదేశంలో ఎవరి దగ్గర లేని కారు వారి వద్దే ఉండాలని కోరుకునే వారు చాలామందే ఉన్నారు. అలాంటి ఓ వ్యక్తి.. ఓ వింటేజ్ కారును ఏకంగా రూ. 1,108 కోట్లు పెట్టి కొన్నాడు. అయితే ఈ ధర పెట్టే అంత ఫీచర్లు కారులో కూడా ఉంది అంటున్నారు విశ్లేషకులు.
1955లో కెనడాలోని ఆర్ఎం సోతెబీ తయారు చేసిన మెర్సిడిస్ బెంజ్ క్లాసిక్ 300 ఎస్ఎల్ఆర్ అలెన్హాట్ కూప్ అనే మోడల్ కార్లు ప్రపంచంలో కేవలం రెండే మిగిలాయి. ఇప్పటివరకు ఇవి బెంజ్ స్టట్గార్ట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉన్నాయి. తాజాగా అందులోని ఒక కారును వేలం వేశారు. దీనికి అనూహ్యంగా 13.5 కోట్ల యూరోలు అంటే రూ. 1,108 కోట్ల ధర పలికింది. దీంతో ప్రపంచంలోని కాస్ట్‌లీ కారుగా దీనికి రికార్డ్ దక్కింది.
అప్పట్లో ఈ మోడల్ కార్లను రేసింగ్‌కు ఉపయోగించేవారు. దీనికి 3.0 లీటర్ ఇంజన్ ఉండగా.. గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ఈ కారు దూసుకెళ్తుంది. అయితే వేలంలో వచ్చిన ఈ వేయి కోట్లతో బెంజ్ సంస్థ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. మెర్సిడిస్ బెంజ్ ఫండ్ పేరుతో టాలెంట్ ఉన్న విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను అందించనుంది. అయితే మెర్సిడిస్ బెంజ్ క్లాసిక్ 300ను అప్పుడప్పుడు ప్రదర్శనకు అనుమతిస్తానని కొనుగోలుదారుడు హామీ ఇచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com