Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూత..

Satya Nadella (tv5news.in)
Satya Nadella: అమెరికాకు వెళ్లి అక్కడ మన భారతీయుల ప్రతిభను చాటిచెప్పినవారు చాలామందే ఉన్నారు. పలు టెక్ దిగ్గజ సంస్థలు సీఈఓలుగా ఉన్న భారతీయుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఒకరు సత్య నాదెళ్ల. మైక్రోసాఫ్ట్ సీఈఓగా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్ల ప్రొఫెషనల్ జీవితం గురించి చాలామందికి తెలిసినా.. పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ తెలీదు. ఇటీవల ఆయన ఇంట ఓ విషాదం చోటుచేసుకుంది.
సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల మృతి చెందారు. పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న జైన్.. ఇటీవల కన్నుమూశారు. సోమవారం ఉదయం జైన్ మరణించినట్టుగా అమెరికా మీడియా తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు కూడా ఈ వార్త చేరింది. వారంతా సత్య నాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సత్య నాదెళ్లకు జైన్ ఒక్కడే కుమారుడు. తనతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. 26 ఏళ్ల వయసులోనే జైన్ మృతి చెందడం వారి కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పలువురు టెక్ దిగ్గజాలు కూడా జైన్ నాదెళ్ల మృతికి సంతాపం తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com