తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ అంతస్థులు.. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరం..

నగరం నలుచెరగులా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్.. ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే బిల్డింగులు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై ఆంక్షలు ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు భాగ్యనగరంలో నిర్మించే బహుళ అంతస్థులకు ఎలాంటి పరిమితులు లేవు.
కానీ ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆమేరకు సెట్ బ్యాక్స్ వదలాల్సి ఉంటుంది. దీంతో పరిమితంగానే ఫ్లోర్లు వేసేవారు. అయితే 2019 ఏప్రిల్ 22న సెట్ బ్యాక్స్ విషయంలో సవరణలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు అన్ని నగరాల్లో అమల్లో ఉన్నా హైదరాబాదులో మాత్రం లేవు.
దీంతో ఇతర నగరాల్లో పరిమితులకు అనుగుణంగానే బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. బిల్డింగ్ చుట్టూ ఖాళీ జాగాను ఎక్కువగా వదులుతున్నారు పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మన దగ్గర పరిమితులు లేకపోవడంతో కొందరు ఎకరం స్థలంలో ఐదారు లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపడుతున్నారు.
ఫ్రీలాంచింగ్, యూడీఎస్ పథకాలతో వచ్చిన కొన్ని సంస్థలు ఎకరా విస్తీర్ణంలో అడుగు కూడా ఖాళీ జాగా వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు కొందరు బిల్డర్లు. పచ్చదనానికి చోటు లేకుండా పూర్తి స్తలంలో నిర్మాణాలు చేపడుతుండడంతో నగరం కాంక్రీట్ జంగిల్‌లా మారిపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com