Mukesh Ambani: రిలయన్స్ విషయంలో ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం.. రాజీనామా తర్వాత..

Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో పగ్గాలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి అప్పగించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ జూన్ 27న రాజీనామా చేశారని సంస్థ స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన ఫైలింగ్స్‌లో వెల్లడించింది.
అదే రోజు జరిగన సమావేశంలో ఆకాశ్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలిపింది. ఆకాశ్ ఇప్పటివరకూ రిలయన్స్ జియోలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2014లో జియో బోర్డులో చేరారు. ఇదే సమయంలో జియో మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్‌ను నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జూన్ 27న పంకజ్ బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల పాటు పంకజ్ ఈ పదవిలో ఉంటారు. ఐతే జియో ప్లాట్ ఫామ్ లిమిటెడ్‌కు ముకేష్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com