టాప్ 10 ధనవంతుల జాబితా నుంచి ముఖేష్ అంబానీ అవుట్!

టాప్ 10 ధనవంతుల జాబితా నుంచి ముఖేష్ అంబానీ అవుట్!
జియో ప్రభావంతో 2020 మధ్యలో టాప్ 10 లోకి వచ్చిన అంబానీ.. ఇప్పుడు వెనక్కు వచ్చారు. టాప్ 10లో కొద్ది రోజుల మాత్రమే ఉన్నారు.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ టాప్ 10 ధనవంతుల జాబితా నుంచి అవుట్ అయ్యారు. టాప్ 10లో కొద్ది రోజుల మాత్రమే ఉన్నారు. జియో ప్రభావంతో 2020 మధ్యలో టాప్ 10 లోకి వచ్చిన అంబానీ.. ఇప్పుడు వెనక్కు వచ్చారు. ఆయన ఆస్తుల విలువ కూడా తగ్గింది. ప్రారంభంలో ఉన్న 90 బిలియన్ డాలర్ల నుండి ఇప్పుడు 76.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ముఖేష్ అంబానీ 2020లో ఆస్తి రూ. 6.62 లక్షల కోట్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 4 వ స్థానానికి వచ్చారు. ఇప్పుడు 5.63 లక్షల కోట్లతో 11 వ స్థానానికి పడిపోయారు. దాదాపు లక్ష కోట్లు సంపద ఆవిరైంది. ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, సెర్చింజన్ గూగుల్ ఫౌండర్ బ్రిన్ కంటే వెనుబడ్డారు. ఇటీవల ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. అప్పటికే రిలయన్స్ అనుబంధ సంస్థల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దీంతో రిలయన్స్ షేర్ ఓ సమయంలో ఆల్ టైం 2,370ని తాకింది. ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేయాలనే రిలయన్స్ నిర్ణయాన్ని అమెజాన్ కోర్టుకు లాగింది. దీంతో షేర్ ధర తగ్గింది. గత రెండు నెలలుగా షేర్ రెండు వేలకు దిగువనే ట్రేడ్ అవుతుంది. డీల్ రిస్క్‌లో పడినప్పటి నుండి దాదాపు 16 శాతం పతనమైంది.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story