రిలయన్స్ కంపెనీకి షాకిచ్చిన కేంద్రం..!!

రిలయన్స్ కంపెనీకి షాకిచ్చిన కేంద్రం..!!

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని విలువ సుమారు రూ.2500 కోట్లు. ఆఫ్ షోర్ పెట్రోలింగ్ వెసెల్స్ నిర్మించి ఇచ్చేలా కంపెనీ 2011లో ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పటికీ కంపెనీ డెలివరీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో రెండువారాల క్రితమే కాంట్రాక్ట్ రద్దు చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి రిలయన్స్ సంస్థ ఈ డీల్ కుదరిన తర్వాత సీనులోకి వచ్చింది.అంతకుముందు ఈ ఒప్పందం నిఖిల్ గాంధీకి చెందిన పిపావావ్ డిఫెన్స్ అండ్ ఆఫ్ షోర్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అయితే 2015లో ఈ కంపెనీని రిలయన్స్ టేకొవర్ చేసి పేరు మార్చింది. ప్రస్తుతం కంపెనీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇప్పటికే అప్పులు కుప్ప పెరిగిపోయింది. రిలయన్స్ నావెల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీకి రూ.11వేల కోట్ల వరకూ అప్పులున్నాయి. ఇప్పటికే డెబిట్ రిజల్యూషన్ ప్రాసెస్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద నడుస్తోంది.

courtesy : Also Read:.profityourtrade


Tags

Read MoreRead Less
Next Story