Netflix: నెట్‌ఫ్లిక్స్ ధరలు తగ్గాయోచ్.. బేసిక్ ప్లాన్ ఎంతంటే..

Netflix: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నెలవారీ సభ్యత్వ రుసుమును తగ్గించింది. ఓటీటీ రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వీక్షకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా సభ్యత్వం తీసుకునేవారికి 60 శాతం వరకు తగ్గింపు లభించనుంది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మొబైల్ నెలవారీ సభ్యత్వానికి రూ.199 చెల్లించాల్సి వస్తోంది.. అయితే అది ఇకపై రూ.149కే లభించనుంది. తగ్గిన ధరలు నేటి నుంచే (మంగళవారం) అమల్లోకి రానున్నట్లు ట్విట్టర్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఇక బేసిక్ ప్లాన్ ధరను రూ.499 నుంచి రూ.199కి తగ్గించారు.
అలాగే స్టాండర్డ్ ప్లాన్‌కు రూ.499 ప్రీమియం ప్లాన్‌కు రూ.649 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇవి వరుసగా రూ.649, రూ.799 వద్ద అందుబాటులో ఉండేవి.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో వీటి సబ్‌స్ర్కిప్షన్లు భారీగా పెరిగాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్, జీ5, ఆహా, హంగామా, ఏఎల్‌టీ, బాలాజీ వంటి సంస్థలు వీక్షకులను ఆకట్టుకునేందుకు వినూత్న కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి.
దీంతో వీటి మధ్య పోటీ పెరిగిపోయింది. అయినా అమెజాన్ ప్రైమ్ తగ్గేదేలే అంటూ.. సభ్యత్వ రుసుమును 50 శాతం పెంచింది. ప్రస్తుతం పే చేస్తున్నది రూ.999 ఉండగా ఇప్పుడు పెంచిన రుసుముతో కలిపి రూ.1,499 అవుతుంది. ప్రస్తుతం నెలవారీ సభ్యత్వ రుసుము రూ.129గా ఉండగా, పెంపుతో రూ.179గానూ (38శాతం అదనం), మూడు నెలలకు రూ.329 కాస్తా రూ.459 (39శాతం అదనం) అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com