Netflix: ఉద్యోగాలలో కోత విధిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. నెల వ్యవధిలో రెండోసారి..

Netflix: ఉద్యోగాలలో కోత విధిస్తున్న నెట్‌ఫ్లిక్స్.. నెల వ్యవధిలో రెండోసారి..
Netflix: నెట్‌ఫ్లిక్స్ అనూహ్యంగా చాలామంది సబ్‌స్క్రైబర్స్ కోల్పోయింది. దీంతో ఆ సంస్థ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది.

Netflix: ఓటీటీ అనేది సినీ పరిశ్రమలో పెద్ద మార్పులనే తీసుకొచ్చింది. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్ పూర్తయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి లేనప్పుడు ఓటీటీలే వాటిని ఆదుకున్నాయి. కానీ థియేటర్లు తెరుచుకున్న తర్వాత మాత్రం ఓటీటీలు వాటికి గట్టి పోటీ ఇస్తున్నాయి. అలా ఓటీటీ అనేది సాఫీగా సాగిపోతున్న సమయంలో కూడా నెట్‌ఫ్లిక్స్.. తను కల్పించిన ఉద్యోగాలలో కోతలు విధిస్తూనే ఉంది.

ఈమధ్యకాలంలో ఓటీటీ సంస్థలు చాలా పెరిగిపోయాయి. ఓటీటీల్లో పోటీ ఎక్కువయిపోయింది. దీంతో అన్నింటికంటే ముందు ఓటీటీల్లో క్రేజ్ సంపాదించుకున్న నెట్‌ఫ్లిక్స్ కాస్త వెనకబడాల్సి వచ్చింది. అందుకే కంపెనీ స్టాక్ వాల్యూ దాదాపు 70% పడిపోయింది. అందుకోసమే గత నెలలోనే నెట్‌ఫ్లిక్స్.. 150 మంది ఉద్యోగులను తొలగించింది. మరో నెల వ్యవధిలోనే ఉద్యోగాలలో భారీగా కోత విధించింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ అనూహ్యంగా చాలామంది సబ్‌స్క్రైబర్స్ కోల్పోయింది. దీంతో ఆ సంస్థ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి పెద్ద సంస్థ భారీగా పెట్టుబడి పెట్టినప్పుడు అభివృద్ధి కోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం తప్పదు అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దానికి తగ్గట్టుగానే 300 మంది ఉద్యోగులను తొలగించింది నెట్‌ఫ్లిక్స్. వినియోగదారుల తగ్గుదల వల్లే సంస్థ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని యాజమాన్యం అంటోంది.

Tags

Read MoreRead Less
Next Story