IPO: నెట్‌వెబ్ IPO కి 2.33 రెట్ల స్పందన

నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఐపీఓ నిన్న ఆరంభమైంది. మొదటి రోజు ఇష్యూకి రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగుల మంచి స్పందన వచ్చింది. 2.౩౩ రెట్ల సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ఐపీఓని సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి జులై 19వ తేదీ, బుధవారం దాకా గడువు ఉంది. అప్పటి వరకు ఇంకా ఎక్కువ మంది సబ్‌స్క్రిప్షన్ చేసుకునే అవకాశం ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లకు 44,86,263 షేర్లు కేటాయించగా, 1,34,67,090 బిడ్లు వచ్చాయి.
మార్కెట్ నుంచి 631 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఇష్యూకి వచ్చింది. ఒక్కో షేర్‌కి 475 నుంచి 500 మధ్య ధరలను నిర్ణయించారు. ఇందులో క్వాలిఫైడ్ సంస్థాగత ముదుపర్లకు 50 శాతం కేటాయించగా, అధిక ఆదాయం ఉన్న వారికి 15 శాతం, మిగిలిన 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు.ప్రమోటర్ల షేర్లను రూ.425లు ధర నిర్ణయించగా, తాజాగా 206 కోట్ల విలువైన షేర్లను ఇష్యూకి అందుబాటులో ఉంచారు.
మొదటి రోజు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 3 రెట్ల స్పందన వచ్చింది. ఉద్యోగుల నుంచి 6.60 రెట్లు, ఎన్ఐఐ విభాగం నుంచి 3.61 రెట్లు, QIB నుంచి 3 రెట్ల స్పందన వచ్చింది.
జులై 14న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 189.01 కోట్లను సేకరించారు. 25 యాంకర్ ఇన్వెస్టర్లకు 500 గరిష్ఠ షేరు ధరతో 37.80 లక్షల షేర్లను కేటాయించారు. యాంకర్ ఇన్వెస్టర్లుగా నొమురా ఫండ్స్, గోల్డ్‌మన్ శాక్స్ ఫండ్స్, ఈస్ట్‌స్ప్రింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇండియా ఫండ్, మోతీలాల్ ఓస్వాల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, నిప్పన్ లైప్ ఇండియా ట్రస్టీ, దరవర మ్యూచువల్ ఫండ్, దకవరద ప్రుడెన్షియల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ కాపిటల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com